ఎన్టీఆర్ వలన డ్యూయెట్స్‌కు నో చెప్పిన వాణి శ్రీ..!

సీనియర్ ఎన్టీఆర్ తో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన వాణి శ్రీ..కళాభినేత్రిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. తనకంటూ ఓ ప్రత్యేకమైన పంథా ఏర్పరుచుకుని నటిగా దాదాపు రెండు దశాబ్దాలకుపైగానే నటిగా కొనసాగింది వాణి శ్రీ. కాగా ఎన్టీఆర్ వలన తాను తర్వాత కాలంలో డ్యూయెట్స్ చేయకూడదని నిర్ణయించుకుందట. ఈ విషయం ఓ ఇంటర్వ్యూలో వాణి శ్రీ చెప్పింది.

సీనియర్ ఎన్టీఆర్-వాణి శ్రీ జంటగా నటించిన సూపర్ హిట్ పిక్చర్ ‘ఎదురు లేని మనిషి’. అశ్వినీదత్ ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిల్మ్.. చాలా బాగా ఆడింది. అయితే, ఇందులో ఓ పాట షూటింగ్ సమయంలో వాణి శ్రీ చాలా ఇబ్బంది పడిందట. వాణిశ్రీకి కొరియోగ్రాఫర్ కంపోజ్ చేసిన స్టెప్పులు నచ్చలేదట. దాంతో ఎన్టీఆర్ వద్దకెళ్లి ఈ విషయం చెప్పిందట.

ఈ విషయమై తనకు మాట సాయం చేయాలని ఎన్టీఆర్ ను వాణి శ్రీ కోరింది. అయితే, ఎన్టీఆర్ ఈ విషయమై తాను ఏమీ చెప్పలేనని అన్నారట. డబ్బులు పెట్టి సినిమా తీసేది వాళ్లు కాబట్టి, వాళ్లు చెప్పినట్లే చేయాలని, ట్రెండ్ అదేనని అన్నారట. దాంతో వాణి శ్రీ ఏమీ చేయలేక ఇబ్బంది పడుతూనే ఆ చిత్రంలోని పాటలను పూర్తి చేసిందట.

అయితే, ఆ తర్వాత తాను చేసే సినిమాల్లో డ్యూయెట్ సాంగ్స్ చేయబోనని ముందే చెప్పేసిందట వాణి శ్రీ. అలా ముందుగానే ఈ కండీషన్ పెట్టుకుంది. పరోక్షంగా వాణి శ్రీ డ్యూయెట్ సాంగ్స్ చేయకపోవడానికి అలా ఎన్టీఆర్ కారణమయ్యారు.