మామఅల్లుళ్లు దుమ్ము రేపారు.. ‘ వెంకీ మామ ‘ ఫ‌స్ట్ గ్లిమ్స్

-

నిజ జీవితంలో మామ అల్లుడు అయిన విక్ట‌రీ వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య వెండితెర మీద కూడా మామ అల్లుడిగా న‌టిస్తోన్న సినిమా వెంకీ మామ‌. జై ల‌వ‌కుశ సినిమా త‌ర్వాత కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే ఈ సినిమాలో వీరిద్ద‌రి క్యారెక్ట‌ర్లు అదిరిపోనున్నాయి. ఇప్ప‌టికే వ‌రుస హిట్ల‌తో జోరుమీదున్న ఈ మామ అల్లుడు వెంకీ మామ‌లో నానా ర‌చ్చ చేస్తున్నార‌ట‌. దసరా పండుగకు అల్లుడు చైతన్య,మామ వెంకటేష్ ల మల్టీ స్టారర్ ‘వెంకీ మామ’ చిత్రంలోని ఫస్ట్ గ్లిమ్స్ వీడియో నేడు విడుదల చేశారు.

ఈ వీడియోలో మామ అల్లుళ్ళ పల్లెటూరి సరదాలు, పోరాటాలతో కూడిన వీడియో ఆకట్టుకొనేలా ఉంది. చైతూని ఉద్దేశిస్తూ వెంకీ చెప్పిన …”గోదావరిలో ఈత నేర్పా..,బరిలో ఆట నేర్పా..,ఇప్పుడు జాతరలో వేట నేర్పుతా…, డైలాగ్ దుమ్మురేపింది. పక్కా పల్లెటూరిని నేపథ్యంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఈ మూవీ కనిపిస్తుంది.

ఇక ఈ సినిమాలో చైత‌న్య దేశం కోసం ప‌నిచేసే ఆర్మీ జ‌వాన్ పాత్ర‌లో కనిపించారు. వెంకీ పల్లెటూరి రైతుగా కనిపిస్తారని సమాచారం. చైతు ప‌క్క‌న రాశీఖ‌న్నా, వెంకీ ప‌క్క‌న హాట్ అందాల భామ పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీ దీపావళి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news