స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఎనిమిది మంది కొడుకులు జన్మించగా.. అందులో చాలామంది వివిధ రంగాలను ఎంచుకున్నారు. ముఖ్యంగా వారిలో ఇద్దరు నిర్మాణ రంగం వైపు వెళ్లి విజయం సాధించలేక వెనుతిరిగి బిజినెస్ చేసుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీ వైపు నందమూరి హరికృష్ణ వచ్చి తన నటనతో ప్రేక్షకులను మెప్పించి స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇక వీరి వారసులుగా నందమూరి కళ్యాణ్ రామ్మ్ అడపాదడపా సినిమాలు చేసుకుంటూ.. నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక నందమూరి తారకరత్న అసలు సినీ ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించడం లేదు. ఇక నందమూరి వారసుల లో స్టార్ హీరో గా చలామణి అవుతున్న ఒకే ఒక్క వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన ఒక్కడే పాన్ ఇండియా హీరో గా చలామణి అవుతూ నందమూరి ఫ్యామిలీ పేరు నిలబెడుతున్నాడు.
రాముడి పాత్ర పోషించాలి అంటే నందమూరి కుటుంబానికే చెందినట్టుగా ఎన్టీఆర్ తర్వాత ఆ వంశానికి చెందిన బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు తారకరత్న కూడా ఎక్కువగా రాముడు పాత్రలు పోషించే వాళ్ళు. 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన తారకరత్న కొంతవరకు విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే నందమూరి వారసుడిగా ఎక్కువకాలం ఇండస్ట్రీలో కొనసాగలేక పోయాడు. ఇక ఆ తరువాత యువరత్న, తారక్ ,భద్రాద్రి రాముడు, వెంకటాద్రి వంటి సినిమాలలో హీరోగా నటించినప్పటికీ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయాడు కానీ అమరావతి సినిమా లో విలన్ గా నటించిన ఈయన నంది అవార్డును సైతం సొంతం చేసుకోవడం గమనార్హం.
ఇకపోతే ఈయన సినిమాలు వరుసగా డిజాస్టర్ కావడంతో సహనం కోల్పోయిన తారకరత్న ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ బిజినెస్ చూసుకుంటున్నారు. ఇక ఇప్పుడు మళ్లీ మహేష్ బాబు సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.