శ్రీకాంత్ రెడ్డి.. రూ.2 లక్షలిస్తా నాతో పడుకో అన్నాడు – కరాటే కళ్యాణి

-

ఇవాళ యూట్యూబ్ ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి పై దాడి జరిగింది. యూసుఫ్ గూడ బస్తీలో శ్రీకాంత్ రెడ్డి ని టాలీవుడ్‌ సినీ నటి కరాటే కల్యాణి చితకబాదారు. ప్రాంక్ పేరుతో మహిళల పై ఇష్టం వచ్చినట్లు చేతులు వేస్తున్నాడు అంటూ కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఈ సంఘటనపై కరాటే కళ్యాణి స్పందించారు.

రూ.2 లక్షల ఇస్తా.. తన దగ్గర పడుకోవాలని శ్రీకాంత్‌ రెడ్డి అడిగాడని కరాటే కళ్యాణి ఆరోపణలు చేశారు. ఎక్కడెక్కడో చేతులు వేసి మహిళలను అగౌరవ పరుస్తున్నాడని ఆరోపించింది.ఒంటిరిగా ఉన్న అమ్మాయిలు, మహిళలను రెచ్చగొట్టి తన కామ కోరికలు తీర్చుకుంటున్నాడని చెప్పింది కరాటే కళ్యాణి.

అయితే.. శ్రీకాంత్‌ రెడ్డి మాత్రం.. తాను డబ్బులు ఇచ్చి పెయిడ్‌ ఆర్టిస్ట్‌ లతో ఈ ప్రాంక్‌ వీడియోలు చేస్తున్నాని.. కరాటే కళ్యాణి బాబీ అంటూ వ్యాంప్‌ పాత్రలు చేస్తే తప్పులేదు.. సినిమాల్లో ఊ అంటవా.. అంటూ హీరోయిన్లు డాన్స్‌ చేస్తే తప్పులేదా అనిప్రశ్నించాడు. కాగా.. ఈ ఘటనపై ఎస్‌ఆర్‌ నగర్‌ లో పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version