1 . ఎం-ఆర్‌ఎన్‌ఏ సంశ్లేషణ చెందే విధానాన్ని ఏమంటారు?
1) ప్రతికృతి
2) అనువాదం
3) ట్రాన్స్లొకేషన్
4) అనులేఖనం
2 . వేరు కొనలో ఒక కణం నుంచి 128 కణాలు ఏర్పడటానికి ఎన్ని సమ విభజనలు జరగాలి?
1) 128
2) 127
3) 64
4) 32
3 . కణ విభజనలోని ఏ దశలో డీఎన్‌ఏ రెట్టింపు అవుతుంది?
1) జీ-1 దశ
2) ఎస్- దశ
3) జీ-2 దశ
4) మధ్యస్థ దశ
4 . క్షయకరణ విభజనలో పారాగతి జరిగే దశ?
1) డిప్లోటీన్
2) జైగోటీన్
3) పాకిటీన్
4) డయాకైనసిన్
5 . ‘కణజాల వర్ధనం’ అనే భావన గురించి పేర్కొన్నవారు?
1) హప్‌మిస్టర్
2) హాబర్‌లాంట్
3) హన్‌స్టయిన్
4) హన్నింగ్
6 . కణజాల వర్ధనంలో అర్ధఘన యానకాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థం?
1) అగార్-అగార్
2) జిగురు
3) రెసిన్
4) పిండి పదార్థం
7 . కేంద్రక రహిత సజీవ కణం ఏది?
1) దారునాళం
2) చాలనీ నాళమూలకాలు
3) దృఢకణాలు
4) దవ్వ రేఖ
8 . బెండు కణాల్లో ఉన్న కణ కవచం దేనితో నిర్మితమవుతుంది?
1) సెల్యులోజ్
2) ఖైటిన్
3) సుబరిన్
4) క్యూటిన్
9 . మొక్కల్లో పార్శ్వ వేర్లు దేని నుంచి ఉద్భవిస్తాయి?
1) బాహ్యచర్మం
2) అంతశ్చర్మం
3) పరిచక్రం
4) దవ్వ
10 .కాస్పేరియన్ మందాలు ఉండటం దేని ముఖ్య లక్షణం?
1) పరిచక్రం
2) బాహ్యచర్మం
3) అంతశ్చర్మం
4) దవ్వ
జవాబులు:
1 . ఎం-ఆర్‌ఎన్‌ఏ సంశ్లేషణ చెందే విధానాన్ని ఏమంటారు?
జవాబు: 4. అనులేఖనం
2 . వేరు కొనలో ఒక కణం నుంచి 128 కణాలు ఏర్పడటానికి ఎన్ని సమ విభజనలు జరగాలి?
జవాబు: 2. 127
3 . కణ విభజనలోని ఏ దశలో డీఎన్‌ఏ రెట్టింపు అవుతుంది?
జవాబు: 2.ఎస్- దశ
4 . క్షయకరణ విభజనలో పారాగతి జరిగే దశ?
జవాబు: 3. పాకిటీన్
5 . ‘కణజాల వర్ధనం’ అనే భావన గురించి పేర్కొన్నవారు?
జవాబు: 2. హాబర్‌లాంట్
6 . కణజాల వర్ధనంలో అర్ధఘన యానకాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థం?
జవాబు: 1. అగార్-అగార్
7 . కేంద్రక రహిత సజీవ కణం ఏది?
జవాబు: 2. చాలనీ నాళమూలకాలు
8 . బెండు కణాల్లో ఉన్న కణ కవచం దేనితో నిర్మితమవుతుంది?
జవాబు: 3. సుబరిన్
9 . మొక్కల్లో పార్శ్వ వేర్లు దేని నుంచి ఉద్భవిస్తాయి?
జవాబు: 3. పరిచక్రం
10 .కాస్పేరియన్ మందాలు ఉండటం దేని ముఖ్య లక్షణం?
జవాబు: 3. అంతశ్చర్మం