శివుడికి ఏ ద్రవాలతో అభిషేకం చేస్తే మంచి ఫలితం ఉంటుంది..

-

సోమవారం శివుడికి చాలా ప్రత్యెకమైన రోజు.. ఈరొజున ప్రతి ఒక్కరూ ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయిస్తారు..కొన్ని రకాల ద్రవాలతో అభిషేకాలు చేయిస్తే ఇంకాస్త మంచి ఫలితాలు ఉంటాయని జొతిష్య పండితులు అంటున్నారు.నిశ్చలమైన భక్తితో ఉద్ధరిణెడు జలంతో అభిషేకించినా శివయ్య సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు ఇట్టే నెరవేరస్తాడు.

అందుకే ఆయనను భోళా శంకరుడు అంటారు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతుంటారు. అలా వినియోగించే ఒక్కో ద్రవ్యానికీ ఒక్కో విశిష్టత ఉంది. అంతేకాదు ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి.మన పెద్దలు విలువైన ఈ సమాచారాన్ని ప్రాచీన గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. ఆ ద్రవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఆవు పాలతో- సర్వ సౌఖ్యాలు

ఆవు పెరుగు- ఆరోగ్యం, బలం

ఆవు నెయ్యి- ఐశ్వర్యాభివృద్ధి

చెరకు రసం (పంచదార)- దుఃఖ నాశనం, ఆకర్షణ

తేనె-తేజో వృద్ధి

భస్మ జలం-మహా పాప హరణం

సుగంధోదకం – పుత్ర లాభం

పుష్పోదకం- భూలాభం

బిల్వ జలం – భోగ భాగ్యాలు

నువ్వుల నూనె- అపమృత్యు హరణం

రుద్రాక్షోదకం- మహా ఐశ్వర్యం

సువర్ణ జలం-దరిద్ర నాశనం

అన్నాభిషేకం- సుఖ జీవనం

ద్రాక్ష రసం- సకల కార్యాభివృద్ధి

నారికేళ జలం- సర్వ సంపద వృద్ధి

ఖర్జూర రసం- శత్రు నాశనం

దూర్వోదకం- ద్రవ్య ప్రాప్తి

ధవళొదకమ్- శివ సాన్నిధ్యం

గంగోదకం-సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి

కస్తూరీ జలం-చక్రవర్తిత్వం

నేరేడు పండ్ల రసం-వైరాగ్య ప్రాప్తి

నవరత్న జలం- ధాన్య గృహ ప్రాప్తి

మామిడి పండు రసం- దీర్ఘ వ్యాధి నాశనం

పసుపు, కుంకుమ- మంగళ ప్రదం

విభూది- కోటి రెట్ల ఫలితం లభిస్తుంది.

మాములుగా మహా విష్ణువు అలంకార ప్రియుడు..మహా శివుడు మాత్రం అభిషేక ప్రియుడు..శివుడు అభిషేకానని చాలా ప్రియంగా భావిస్తుంటాడు. కాబట్టి అభిషేక ప్రియుడు అంటారు. ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. అందుకే శివార్చనల అభిషేకం చాలా ముఖ్యమైంది. ప్రతి సోమవారం అభిషేకం చేయిస్తే చాలా మంచిది మంచి ఫలితాలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version