వాస్తు: దేవుడి గదిలో ఈ మార్పులు చేస్తే ఆర్ధిక సమస్యలు వుండవు..!

వాస్తు పండితులు ఈ రోజు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. వీటిని కనుక మీరు పాటించారు అంటే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చు. అలానే ధన నష్టం కూడా ఉండదు. వాస్తు శాస్త్రం ప్రకారం చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల సమస్యలు ఏమైనా ఉంటే దూరంగా వెళ్లి పోతాయి.

మన ఇంట్లో దేవుడి గది లో ప్రశాంతంగా కూర్చుని ఏ ఒత్తిడి లేకుండా కంఫర్టబుల్ గా ఉండచ్చు. దేవుడి గది లోకి వెళ్లగానే ఏదో పాజిటివ్ ఎనర్జీ మనలో కలుగుతుంది. కాసేపు దేవుడి గదిలో ఉంటే పూర్తి నెగటివిటీ దూరం అయిపోతుంది.

అయితే ప్రశాంతంగా.. ఏ ఒత్తిడి లేకుండా నెగిటివిటీ దూరమై పోవాలి అంటే దేవుడి గది లో వేసే రంగు పైన కూడా శ్రద్ధ పెట్టాలి. అయితే దేవుడి గదిలో ఏ రంగు వేస్తే మంచిది..?, ఏ రంగు వేయడం వల్ల పాజిటివిటీ ఉంటుంది అనేది చూస్తే..

ఇంట్లో ఉండే దేవుడి గది లో లేత పసుపు రంగు వేస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు. లేదా ఎరుపు, కాషాయం కూడా వేసుకోవచ్చు. అలాగే గచ్చు రంగు తెలుపు కలర్ అయితే మంచిది అని చెప్తున్నారు. వీటిని వేయడం వల్ల వాస్తు దోషాలు కూడా పోతాయని పండితులు చెప్పడం జరిగింది. కనుక వీటిని పాటించి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ధన నష్టం కూడా ఉండదు.