రోజూ హారతి ఇవ్వొచా?ఇస్తే ఏమౌతుందో తెలుసా?

-

హిందువులు ప్రతి రోజూ దేవుడిని ప్రార్ధిస్తారు..ప్రతి రోజూ దీపం వెలిగించకుంటే దినాము నష్టం జరుగుతుందని నమ్ముతారు.అందుకే ఉదయం, సాయంత్రం దీపం వెలిగిస్తారు. దీపాల, ధూపం, కర్పూరంతో దేవుడిని పూజించడం ఆనవాయితీ. శుభకార్యాల్లో కూడా ఇలా చేస్తుంటారు. ఎందుకంటే ఇలా చేస్తే పర్యావరణం శుభ్రపడుతుందని , సానుకూల శక్తి చుట్టుమడుతుందని నమ్ముతుంటారు.

ప్రతిరోజూ ఇంట్లో కర్పూరం వెలిగించి ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేస్తే…ఆ ఇల్లు సానుకూల శక్తితో నిండిపోతుంది. ఇంట్లో సుఖశాంతులు, శాంతి ఐశ్వర్యం లభిస్తుంది. అంతేకాదు ఒక రూపాయికి దొరికే కర్పూరాన్ని ఇంట్లో వెలిగించినట్లయితే..జీవితంలో కూడా పెను మార్పులు చూడవచ్చు. కర్పూరం అనేక సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రోజూ ఇంట్లో కర్పూరం వెలిగిస్తే ఎటువంటి మార్పులు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఇంట్లో కర్పూరం వెలిగిస్తే…సానూకూల శక్తి వ్యాపించడం ప్రారంభం అవుతుంది. ఇది జీవితంలోపురోగతి, విజయానికి మార్గంగా నిలుస్తుంది. ఇది కుటుంబంలో విభేదాలను తగ్గించడంతోపాటు ఆనందం, శాంతి, శ్రేయస్సుు పొడిగిస్తుంది.

కర్పూరాన్ని వెండి కానీ ఇత్తడి గిన్నెలో ప్రతిరోజూ వెలిగించాలి. కర్పూరంతో మీరు బెడ్ రూంను శుభ్రం చేసినట్లయితే…వైవాహిక జీవితంలో సమస్యలు రావు..

ఇంట్లో ప్రతిరోజూ మూడు కర్పూరంను కాల్చండి. ఇది ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. జీవితంలో ఆహారం, డబ్బు సమస్యలను కూడా తొలగిస్తుంది..

అంతేకాదు మనుషులకు ఇప్పుడు కామన్ గా ఉండే సమస్యలు దూరం అవుతాయి.పాజిటివ్ ఎనర్జీ ఇంటిని చుట్టుముడుతుంది. కర్పూరం కరిగితే..వాస్తు దోషం తొలగిపోతుందని అర్ధం చేసుకోవాలి..ఆ వాసన మనిషికి ఒత్తిడిని దూరం చేస్తుంది.ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపాలు, కర్పూరం వెలిగించి పూజించడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news