ఇంటికి వాస్తు అనేది చాలా ముఖ్యం. అది కరెక్టుగా లేదంటే..ఇంట్లో ఎంత డబ్బున్నా ప్రశాంతత, ఆనందం, ఆరోగ్యం ఉండడు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే..వాస్తుని పర్ఫక్ట్ గా ఫాలో అవ్వాలి. వాస్తుకు సైన్స్ దగ్గర సంబంధం ఉంది. మార్కెట్ లో అందంగా ఉన్నాయికదా అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే..అనవసరమైన తలనొప్పి తెచ్చిపెట్టుకున్నట్లే. కొన్ని వాస్తు నియమాల గురించి తెలుసుకుందాం.
1. వాస్తు ప్రకారం ఇంటి ప్రవేశ ద్వారం చాలా ముఖ్యమైనది. అక్కడ గణపతి విగ్రహాన్ని ఉంచటం ఉత్తమం. ఈ పరిహారం చేయడం వల్ల ప్రవేశ ద్వారానికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి.
2. వాస్తు ప్రకారం ముళ్ల మొక్కలు, మాంసాహార జంతువులు, తాజ్ మహల్, మహాభారతం లేదా ఏదైనా యుద్ధ చిత్రాలను ఇంట్లో ఉంచకూడదు. ఇలాంటి చిత్రాలు ఇంటిలోపల ప్రతికూలతను తెచ్చి వ్యక్తిని అపజయం వైపు నెడతాయి.
3. ఇంటి వంటగది వాస్తును జాగ్రత్తగా చూసుకోవాలి. వాస్తు ప్రకారం ఆగ్నేయం వంటగదికి ఉత్తమమైనది. మీ వంటగదిని ఈ దిశలో నిర్మించడమే కాకుండా వంట చేసేటప్పుడు మీ ముఖాన్ని తూర్పు వైపున ఉంచాలి.
4. వాస్తు ప్రకారం ఆనందం, శ్రేయస్సు కోరుకునే వారు తమ ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. భారీ వస్తువులు, చెత్త ఉండకూడదు. పనికిరాని వస్తువులను ఇంట్లో ఉంచకూడదు ఎందుకంటే ఇవి ప్రతికూల శక్తిని ప్రేరేపిస్తాయి. చాలామంది పాతవి, అనవసరమైని పారేయకుండా అలానే పెట్టుకుంటారు. అలా అసలు చేయకూడదు. మనకు అవసరం లేదు అనేవి వేరేవాళ్లకు ఇచ్చేయడమే, పడేయడమే చేయాలి.
5. వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య మూలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే మీ పూజగదిలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఫోటోను ఉంచి ప్రతిరోజూ పూజించాలి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని అందించటం జరిగింది.
-Triveni Buskarowthu