శ్రీ వికారినామ సంవత్సరం తులారాశి రాశిఫలాలు
ఉత్తరాషాఢ-2,3,4పాదాలు, శ్రవణం- నాలుగు పాదాలు
దనిష్ఠ- 1,2 పాదాలు
ఆదాయం-5 వ్యయం- 2
రాజపూజ్యం-2 అవమానం-4
ఈరాశి వారికి గురువు వ్యయంలో, లాభస్థానంలో సంచరిస్తాడు. అనవసర ఖర్చులు, బయటివారితో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఏపని చేసినా సానుకూలంగా ఉంటుంది. శని వ్యయస్థానంలో ఉన్నందున వైద్యసేవలు పొందవలసి ఉంటుంది. ఆకస్మికలాభాలు వస్తాయి. రాహు, కేతువుల సంచారం షష్టమం, వ్యయంలో ఉన్నాయి. దీనివల్ల జీవన సమస్యలు తొలుగును, ప్రతి పనిలో విజయం, కలల వలన నిద్రలేమి ఉంటుంది.ఆర్థికంగా రావాల్సిన సొమ్ము ఆలస్యంగానైనా వస్తుంది.

ఈరాశి గ్రహపరిశీలనలో… ఈ ఏడాది సామాన్యంగానే ఉన్నది. అయితే ఒక గ్రహం మంచిగా లేని సమయంలో మరో గ్రహం ఆదుకుంటున్నది. అలా ఇబ్బంది ఉన్నా ఇలా పోతుంది. కాకపోతే మంచి ఆలోచనలు, పట్టుదల ఉంటే తప్పక ఇది మంచి ఏడాదిగానే మిగిలిపోతుంది. గురు, శని సంచారాలు, వక్రాలు ఉన్నా అనుకూలతనే ఇస్తాయి. జీవితానికి ఉపయోగపడుతాయి. ఇతరుల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. నూతన గఋహ యోగం ఉంది. చేసేపనిల, ఉద్యోగంలో లాభం లేకున్నా సంతోషంగానే ఉంటుంది. వ్యవసాయదారులకు మొదటి పంట అనుకూలం. విద్యార్థులు తాము ఆశించిన ఫలితాలు పొందడానికి మరింత ఎక్కువ కష్టపడాలి. వ్యాపారులకు ఆదాయం పెరుగును, కాంట్రాక్టర్లు, ఫైనాన్స్ వారికి నూనత పెట్టుబడులు కలిసి వస్తాయి. ఇంజినీర్లు, లాయర్లు, డాక్టర్లు తాము కోరుకున్న మార్గాలవైపు ప్రయాణం చేయవచ్చు. కళాకారులకు ప్రజల్లో మంచి గుర్తింపు పొందుతారు. ఈరాశి స్త్రీలకు ఆదాయం కన్నా ఖర్చు అధికం. కార్యాల్లో ఆటంకాలు ఉంటాయి. శ్రీరామరక్షా స్తోత్రం చేసుకుంటే ఈరాశి వారు అన్ని విధాలుగా లబ్ది చేకూరుతుంది.
చైత్రమాసంలో గ్రహస్థితి అనుకూలంగా వుంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు ఉద్యోగాలలో ఉన్న-వారు, స్వయంవృత్తిలో ఉన్న వారు సంతృప్తికరంగా వుంటారు. వ్యాపారము లాభదాయకంగా వుంటుంది. అనుకున్న స్థాయిలో లాభాలు ఉంటాయి. వైశాఖ మాసంలో కుటుంబ వ్యవహారాలలో సానుకూలత ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల చదువు, ఉద్యోగ విషయాలకై చేయు ప్రయత్నాలలో విజయం చేకూరుతుంది. దేవతా, గురుభక్తి పెరుగు-తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. జ్యేష్టమాసంలో గ్రహస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ప్రతి పని-లోనూ ఆలోచన, నిబద్ధత అవసరం. వ్యాపారస్తులు అనాలోచిత పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. ఆషాఢమాసంలో కూడా గ్రహస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో ఆందోళన, అసహ-నము చోటు చేసుకుటుంది. శ్రావణ మాసంలో ప్రారంభించిన పనులలో విఘ్నాలు. ఆర్థిక సమస్యల మూలంగా కొన్ని మధ్యలో నిలిచి పోవడము. అనవ-సరమైన ఖర్చులు రావలసిన డబ్బు సమయానికి అందక పోవడము. భాద్రపద మాసంలో మొదటి మూడు వారాలు ప్రతికూలంగా ఉంటూ, 4వ వారము అనుకూలంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందడం మూలంగా కొన్ని పనులు చేసుకోగ-లుగుతారు.
అన్నదమ్ములు, ఆత్మీయుల ఆదరణ తద్వారా కొన్ని పనులు నెరవేరే అవకాశము మాసాం-తంలో ఉంటుంది. ఆశ్వీయుజ మాసంలో అనుకూ-లంగా ఉంటుంది. భార్యాపిల్లలతో సంతోషంగా గడు-పుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా వుంటాయి. కార్తీక మాసంలో మొదటి రెండు వారములు అను-కూలంగా ఉంటాయి. చివరి రెండు వారములలో ఆటంకాలు ఉంటాయి. మార్గశిర మాసంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. రావలసిన డబ్బు సకాలంలో అందక పోవడము. ప్రారంభించిన పనులు అనుకున్న సమ-యంలో పూర్తి కాకపోవడము. అయిష్టతతో పనులు చేయవలసి వచ్చుట. పౌష్య మాసంలో మిశ్రమ ఫలి-తాలు ఉంటాయి. స్వయంవృత్తిలో ఉన్న వారు పని-వారితో సమస్యలను ఎదుర్కొంటారు. మాఘ మాసంలో ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. ఆటంకాలు ఉన్నా సంతృప్తికరంగా ఫలితాలు ఉంటాయి. భార్యా పిల్లలతో సానుకూలత. నలుగు-రిలో గౌరవ మర్యాదలను పొందుట. రావలసిన డబ్బు వస్తుంది. ఫాల్గుణ మాసంలో మిశ్రమ ఫలి-తాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు ఆటంకాలు ఏర్పడినా పూర్తవుతాయి. నూతన వ్యక్తుల పరిచయా-లతో కొన్ని పనులు నెరవేరుతాయి. స్వయంవృత్తిలో ఉన్న వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.
-కేశవ
మిగతా రాశులను తెలుసుకోవాలంటే ఈ క్రింది వాటిని క్లిక్ చేయండి..











