శ్రీ వికారిలో మాసాల వారీగా రాశుల ఫలితాలు తెలుసుకుందామా !
మేష రాశి యొక్క రాశి ఫలాలు :
(అశ్విని 1,2,3,4 పాదాలు, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం)
ఆదాయం-14, వ్యయం-14
రాజపూజ్యం-3, అవమానం-6
చైత్రమాసంలో ఈ రాశి వారికి వాహనాల మూలంగా అనుకోని ఖర్చులు ముందుకు వస్తాయి. నియంత్రిం-చుకోవడం మంచిది. అనవసరమెన ప్రయాణాలు ముందుకు వస్తాయి. స్వయంవృత్తి, ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు ఉద్యోగాలలో, వ్యాపారాలలో ఉన్నవారు స్వయంకృతం మూలంగా సమస్యలు ఎదుర్కోవచ్చు. మాసం ద్వితీయభాగంలో కొంత అనుకూలత ఉంటుంది. టెన్షన్ తగ్గి, సజావుగా పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుపై ప్రణాళికా బద్ధంగా, శ్రద్ధతో ముందుకు వెళ్లడం మూలంగా సత్ఫలితాలను పొందుతారు. వైశాఖంలో అన్నద-మ్ములు, బంధువులు, వాహనముల మూలంగా కొన్ని సత్ఫలితాలను పొందుతారు. రావలసిన డబ్బు వస్తుంది. అయితే, కొంత అలసట మూలంగా అనా-రోగ్యం ఉంటుంది. ప్రారంభించిన పనులలో డబ్బు అవసరం మూలంగా కొంత మానసిక ఒత్తిడి కల-గొచ్చు. వృత్తి, వ్యాపారములలో ఉన్న వారికి సంతృ-ప్తికరంగా ఉంటుంది. జ్యేష్టమాసంలో రావలసిన డబ్బు సమయానికి అందుతుంది. ఆరోగ్యసమస్యలు పరిష్కరింప బడతాయి. ఉత్సాహంతో పనులు చేయ-డము మూలంగా సత్ఫలితాలను పొందుతారు. బంధువులు, స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. మాసాంతంలో కుజుని స్థితి వలన భూములు నిర్మాణరంగానికి సంబంధించిన పనులలో కొంత ఆలస్యము చోటు చేసుకుంటుంది. ఆషాఢంలో మొదటి రెండు వారములలో అనుకున్న పనులు నెర-వేరుతాయి. రావలసిన డబ్బు చేతికందుతుంది. చివరి రెండు వారాలలో పనులలో కొంత ఆలస్యము. తద్వారా నలుగురిలో ఇబ్బందికర పరిస్థితిని ఎదు-ర్కొనుట.

శ్రావణ మాసంలో గ్రహసంచారము ప్రతి-కూలంగా ఉన్నది. కనుక కొత్త పనులు ప్రారంభించ-కుండా ఉండడం మంచిది. భాద్రపదంలో కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. మొదటి రెండు వారా-లలో కొన్ని ఇబ్బందులు ఉన్నా మాసాంతంలో కలిసి వస్తాయి. ఆశ్వీయుజ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసరమైన ఆలోచనలకు ప్రాధాన్య-మివ్వడం మూలంగా మానసిక, శారీరక ఇబ్బందు-లను ఎదుర్కొంటారు. కార్తీకంలో గురు భాగ్యస్థానం-లోకి రావడం మూలంగా అనుకూలత ప్రారంభం అవుతుంది. అన్ని విషయాలలో ఆలోచించి ముందుకు వెళ్లినట్లయితే సత్ఫలితాలను పొందుతారు. మార్గశిర మాసంలో కుజుని సంచారము అనాను-కూలంగా ఉండడంతో వ్యవసాయదారులకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అధిక శ్రమ గోచరిస్తుంది. పనులను నిర్దిష్టంగా పూర్తి చేయడము చాలా అవ-సరం. పౌష్య మాసంలో మిశ్రమ ఫలితాలుంటాయి. కొన్ని విషయాలలో అనుకూలత, కొన్నింటిలో ప్రతి-కూలత ఉంటుంది. మాఘ మాసంలో మంచి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా పనులు నెరవేరుతాయి. ప్రారంభించిన పనులు అనుకూలంగా పూర్తి అవుతాయి. ఫాల్గుణంలో ప్రయత్నాలు ఫలిస్తాయి. భార్యాపిల్లలతో సంతోషంగా వుంటారు. బయటి వ్యక్తుల సహాయ సహకారాలు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్త-వుతాయి.
మొత్తంగా మేష రాశి ఫలితాలు – శని సంచారం కింది ఉద్యోగుల సహాయ సహకారాలు బాగుంటాయి, జనసహకారం ప్రయోజనకరంగా ఉంటుంది. పనిలో శ్రద్ధను పెంచడం, పెద్దలకు సేవ చేయడం మంచిది. షష్టమస్థానంలో శని సంచారం వలన క్రియాశీలత పెరిగి నైపుణ్యం వృద్ధి అవుతుంది. గురువు తొమ్మిందింట సంచారం వల్ల ఆర్థిక విషయాలు బాగా ఉంటాయి. రాహు, కేతు సంచారం వల్ల ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. విద్యార్థులకు నూతన విద్యలకు పొందుటకు అవకాశం, కాంట్రాక్టర్లకు, ఫైనాన్స్, బ్రోకర్లకు ఉన్నతమైన ఆదాయమార్గాలు ఏర్పడుతాయి. ఫ్యాన్సీ, కిరాణ, వస్త్రవ్యాపారాలకు ఆదాయం పుష్కలం, సినీరంగం, కళాకారులకు విశేషమైన బహుమతులు వస్తాయి. డాక్టర్లు, ఇంజినీర్లకు, లాయర్లకు ఆశించిన ఫలితాలు లాభంగా పొందుతారు. కంప్యూటర్ రంగంలోనివారికి అశుభప్రదంగా ఉన్నది, రాజకీయనాయకులకు ఇతర ఆదాయములు ఎక్కువగా పొందుతారు, ఈరాశి స్త్రీలకు రాజకీయ రంగ ప్రవేశం కలదు.
– కేశవ
మిగతా రాశులను తెలుసుకోవాలంటే ఈ క్రింది వాటిని క్లిక్ చేయండి..











