శ్రీ వికారినామ సంవత్సరం కుంభరాశి రాశిఫలాలు
ధనిష్ఠ-3,4 పాదాలు, శతభిషం-1,2,3,4 పాదాలు
పూర్వాభాద్ర-1,2,3 పాదాలు
ఆదాయం-5 వ్యయం- 2
రాజపూజ్యం-5 అవమానం-4
ఈరాశివారికి ప్రధాన గ్రహ సంచారం పరిశీలిస్తే.. గురువు లాభస్థానంలో సంచరించే సమయంలో ధనలాభం, ఇతరులను ఆకర్షిస్తారు. పదింట సంచరించే సమయంలో ఉద్యోగంలో మంచి మార్పులు ఉంటాయి. కొత్త ఇల్లు కట్టుకునే అవకాశం. శని సంచారం చూస్తే.. ధనస్సులో అంటే లాభస్థానంలో ఉంటాడు. ఏది చేసినా రెండింతలు అవుతుంది. రాహు, కేతువుల సంచారం వల్ల ఆలోచనల్లో తేడాలు ఉంటాయి. మంచి ఆలోచనలు మాత్రమే చేయండి. పుత్ర సంతానం వల్ల ఇబ్బందులు. బంధువుల వల్ల కష్టాలు తీరుతాయి.
ఈరాశివారికి గ్రహపరిశీలన తర్వాత ఫలితాలు చూస్తే…. విపరీతంగా ఖర్చులు, నానా కష్టాలు, కోర్టు, విదేశీ ప్రయత్నాలు సంవత్సరాంతాన అనుకూలిస్తాయి. గుండె సంబంధ వ్యాధులకు అవకాశం జాగ్రత్త. స్థిరాస్థి వ్యవహారాలు అనుకూలిస్తాయి. లాభం ఉన్నా అనుభవించుట కష్టం. తోటి ఉద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యవసాయదారులకు ఆదాయం చేతికందక ఇబ్బంది పడుతారు. కంప్యూటర్ రంగంలో వారికి శుభప్రదం. విద్యార్థులు చదువు కోసం ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. వ్యాపారస్తులు కొత్త ఆలోచనల ద్వారా ముందుకు పోతారు.

కళాకారులకు సామాన్యంగా ఉంటుంది. ప్రొఫెషనల్స్‌కు కొత్త పదవులు వస్తాయి, కానీ మానసిక అశాంతి ఉంటుంది. రాజకీయనాయకులకు ప్రజా శ్రేయస్సు కంటే తమ శ్రేయస్సే ఎక్కువ అన్నట్లు వ్యవహరిస్తారు. ఈరాశి స్త్రీలు దూర ప్రాంత పుణ్యక్షేత్ర సందర్శన సిద్ధి, ప్రభుత్వ సంబంధ ఉద్యోగ అవకాశం సంవత్సరాంతనా కలుగుతుంది. వీరు దుర్గాదేవి పారాయణం, మఋత్యుంజ హోమం, మంత్ర పారాయణం/జపం చేసుకోవడం చాలా మంచిది.
చైత్రమాసంలో ప్రారంభించిన కార్యక్రమాలు పూర్త-వుతాయి. శ్రద్ధ, ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి. స్వయంవృత్తిలో ఉన్న వారికి కొత్త అవకాశాల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారము లాభసాటిగా వుంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ-ములలో ఉన్న వారికి పై అధికారుల అండదండలు ఉంటాయి. వృధాఖర్చులను నియంత్రించాలి. వైశాఖ మాసంలో ప్రారంభించిన పనులలో కొంత సానుకూ-ల్యత, కొన్నింటిలో ఆలస్యము ఉంటుంది. చురుకుద-నంతో పనులు చేయడం మూలంగా సత్ఫలితాలను పొందుతారు. జ్యేష్టమాసంలో అనవసరమైన సమ-స్యలు ఉత్పన్నమవుతాయి. పెద్దల సహాయ సహకా-రాలు తీసుకోవడం అవసరం. తొందరపాటు లేకుండా ఆలోచనతో ముందుకు వెళ్లాలి. ప్రయాణాల మూలంగా అలసట, అనారోగ్యములు. ప్రారంభించిన పనులు ఆలస్యంగా ముందుకు సాగుతాయి. ఆషాఢ మాసంలో స్నేహితులు, బంధువుల సహాయ సహకా-రాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు పరిష్కరింప బడ-తాయి.
వ్యాపారస్తులకు రోజు చేసే క్రయ విక్రయా-లలో లాభాలు ఉంటాయి. ఆర్థికాభివృద్ది ఉంటుంది. శ్రావణ మాసంలో వాహనముల మూలంగా ఇబ్బం-దులు. వృధా ప్రయాణాలు. ఆదాయము అనుకూ-లంగా ఉంటుంది. రావలసిన డబ్బు వస్తుంది. భాద్ర-పద మాసంలో అనవసరమైన ప్రయాణాలు, వృధా ఖర్చులు, వాహనముల మూలంగా ఊహించని ఖర్చులు. పెద్దల సహాయ సహకారాలను విస్మరించ-డంతో సమస్యలు. ప్రారంభించిన పనులు పూర్తి అవుతాయి. సమయస్ఫూర్తితో మెలగడం చాలా మంచిది. ఆశ్వీయుజ మాసంలో మొదటి రెండు వారాలు ప్రతికూలంగా ఉంటాయి. మూడు, నాలుగు వారాలు అనుకూలంగా వుంటాయి. వృధా ఖర్చులు, ప్రయాణాల మూలంగా ఇబ్బందులు. కార్తీక మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. అందరితో సుహృద్భావ వాతావర-ణము సంతృప్తిని ఇస్తుంది. ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మార్గశిర మాసంలో ప్రారం-భించిన పనులు సకాలంలో పూర్తవుతాయి.
భార్యా పిల్లలతో సంతోషంగా వుంటారు. నలుగురికి ఉప-యోగపడే పనులు చేస్తారు. స్నేహితులు, బంధువుల సానుకూలత ఉంటుంది. పౌష్య మాసంలో గ్రహస్థితి అనుకూలంగా వుంటుంది. పెట్టుబడుల మూలంగా లాభాలను పొందుతారు. స్థిర, చరాస్తులు కొనడానికి అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలి-స్తాయి. మాఘ మాసంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఉన్నా కార్యసాఫల్యము ఉంటుంది. రావలసిన డబ్బు సమయానికి రాకున్నా పనులు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఫాల్గుణ మాసంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో కాక-పోవడంతో మానసిక ఆందోళనకు గురవుతారు. ఆర్థికపరమైన లావాదేవీలలో జాగ్రత్త అవసరం.
– కేశవ
మిగతా రాశులను తెలుసుకోవాలంటే ఈ క్రింది వాటిని క్లిక్ చేయండి..











