వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఎలాంటి బాధ ఉండదు. చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. మీరు కూడా వాస్తు ప్రకారం అనుసరించి ఏ బాధ లేకుండా ఆనందంగా ఉండొచ్చు. ఈ రోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పారు. వీటిని కనుక అనుసరిస్తే ఏ బాధ ఉండదు. పూజ సమయంలో ఇలాంటివి కనుక జరిగితే అవి అస్సలు మంచివి కావని శుభానికి చిహ్నం కాదని పండితులు అంటున్నారు. ఇటువంటివి జరిగితే అది అశుభమని భావించాలని వాస్తు పండితులు చెప్పడం జరిగింది మరి ఎటువంటి వాటిని అశుభంగా మనం పరిగణలోకి తీసుకోవాలి అనే ముఖ్య విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
వాస్తు శాస్త్రం ప్రకారం ఈ తప్పులు జరగడం వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి చేతిలో నుండి కానీ ఏదైనా తగిలి కానీ దేవుడు విగ్రహం కింద పడి పగిలిపోతుంది ఇటువంటివి జరిగితే అది అశుభం. అలానే పూజ చేస్తున్నప్పుడు దీపం ఆరిపోతే కూడా అది అశుభం. ప్రసాదం చేతులు నుండి కిందకి జారిన లేదంటే ప్రసాదం పెట్టిన కప్పు కింద పడిపోయినా సరే అది అశుభంగా భావించాలని వాస్తు పండితులు అంటున్నారు.
అలానే పూజ చేసేటప్పుడు పగిలిపోయిన విగ్రహాలకి పూజ చేయకూడదు పగిలిపోయిన విగ్రహాలకి, విరిగిపోయిన విగ్రహాలకి పూజ చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. కాబట్టి ఈ తప్పులు జరగకుండా చూసుకోండి. ఒక్కొక్కసారి మన పొరపాట్ల వల్ల కూడా ఇటువంటి తప్పులు జరుగుతూ ఉంటాయి కానీ పదే పదే బాధపడకండి.