వాస్తు: మీ ఇంట్లో ధనం ఉండాలంటే ఇలా చెయ్యండి..!

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి ధనానికి సంబంధించి ముఖ్యమైన విషయాలను చెప్పారు. వీటిని అనుసరిస్తే సమస్యలే వుండవు.

వాస్తు శాస్త్రం ప్రకారం ధనం కలగాలంటే బెడ్రూంలో ఉండే కిటికీలను తెరుస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన నెగటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
అలానే చెప్పుల స్టాండ్ కూడా ముఖద్వారం ఎదుటే ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఇలా ఉంచడం మంచిది. దీని వలన ధనం పెరుగుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం మీ పర్సు లో కొంచెం బియ్యాన్ని ఉంచడం వలన ధనం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణం వైపు తల పెట్టుకుని నిద్రపోవడం మంచిది దీని వలన శాంతి కలుగుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రశాంతత ఉండి డబ్బులు రావాలంటే చేపని ఉంచండి. నెమలీకలని ఇంట్లో ఉంచడం వలన కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది డబ్బులు కూడా విపరీతంగా పెరుగుతాయి.