Vasthu : మరణించిన వారి ఫొటోలు ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా..?

-

వాస్తు.. నమ్మని వారు ఓకే కానీ.. నమ్మేవారు మాత్రం అడుగడుగు వాస్తు ప్రకారమే ఉండాలని కోరుకుంటారు. లేకపోతే తమ జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా అది వాస్తు దోషమేనని భావిస్తూ ఉంటారు. ఇలాంటి వారి కోసమే ఈ స్టోరీ. ఇంతకీ దేని గురించి అంటే.. మరణించిన మన ఆత్మీయుల ఫొటోలను ఇంట్లో ఎక్కడ ఉంచాలనే విషయం మీకు తెలుసా.. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి మరి..

వాస్తు.. ఫాలో అయ్యేవారికి మాత్రం అడుగేసినా తీసినా అంతా వాస్తుప్రకారమే ఉండాలంటారు. వాస్తు అంటే కేవలం ఇంటి నిర్మాణం సమయంలో ఫాలో అయ్యేవి మాత్రమే కాదు..ఇంట్లో అణువణువూ పాటించాల్సిన చాలా ఉంటాయి. వాటిలో ఒకటి, అందరకీ కామన్ గా వచ్చే డౌట్ చనిపోయిన వారి ఫొటోలు ఎక్కడ ఉంచాలి, ఎక్కడ పెట్టకూడదనే. ఎందుకంటే చనిపోయిన వారి ఫొటోలు పెట్టేందుకు కూడా వాస్తు ఫాలో అవుతారు.. లేదంటే ఆ ఇంట సుఖ శాంతులు, సంతోషం హరించుకుపోతుందని వాస్తుపండితులు చెబుతారు.

చనిపోయిన వారి ఫొటోలు ఇంట్లో పెట్టుకోవడం, నిత్యం వారిని స్మరించుకోవడం వల్ల ఆ వారి ఆశీశ్సులు ఉంటాయని భావిస్తారు. అందుకే ఫ్రేమ్ కట్టించి ఇంట్లో గోడకు తగిలిస్తారు. ఇంట్లో ఉంటే చాలుకదా అని ఎక్కడంటే అక్కడ పెడితే అనుకూల ప్రభావం మాటేమో కానీ ప్రతికూల ప్రభావం ఆ ఇంటిపై పడుతుందంటారు. ఎందుకంటే చాలా మంది చనిపోయినవారిపై అత్యంత ప్రేమ లేదా భక్తితో దేవుడి మందిరంలో పెడుతుంటారు. ఇంకొందరు బెడ్ రూమ్స్ లో, డైనింగ్ రూమ్స్ లోనూ తగిలిస్తుంటారు. అస్సలు ఇలా చేయకూడదని చెబుతారు వాస్తుపండితులు.

  • చనిపోయిన వారి ఫొటోలు దేవుడి మందిరంలో పెట్టకూడదు, ఇలా చేస్తే ఆ ఇంట సమస్యలు పెరుగుతాయి
  • బెడ్ రూమ్, డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు వెంటాడతాయి
  • చనిపోయిన వారి ఫొటోల పక్కన బతికుండే వారి ఫొటోలు ఉండకుండా చూసుకోవాలి. కాదు కూడదు అంటే ఆ ప్రభావం బతికున్న వారి ఆయుష్షుపై పడుతుందట
  • ఇంతకీ చనిపోయిన వారి ఫొటోలు ఎక్కడపెట్టాలంటే కేవలం దక్షిణం వైపున్న గోడకు మాత్రమే. ఎందుకంటే దక్షిణ దిక్కు యముడి స్థానం. ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లో అకాల మరణాలు సంభవించవని, కుటుంబ సభ్యులు ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తారని అంటారు.
  • దక్షిణంవైపు గోడకు చనిపోయిన వారి ఫొటోలు వేలాడదీసినట్టే..వాటికి ఎదురుగా ఉత్తరం వైపు గోడకు ఆంజనేయుడి ఫొటో పెడితే ఇంకా మంచిదంటారు.

Read more RELATED
Recommended to you

Latest news