
మెదక్ జిల్లా టిఆర్ఎస్ తొలి అధ్యక్షురాలిగా నియామకమైన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సత్కరించి అభినందనలు తెలిపారు. గురువారం ఆమె స్వగృహానికి చేరుకుని గజ మాలలు, శాలువాలు, పుష్పగుచ్ఛాలతో అభినందించారు. మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.