నాగార్జునసాగర్ నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ డాక్టర్ పానుగోతు రవి కుమార్ నాయక్ గురువారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ని కలిశారు. దేశంలో 12 కోట్ల బంజారా జనాభా ఉందన్నారు. బంజారా భాష మాట్లాడే గోరబోలిని భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూలో చేర్చాలన్నారు. కార్యక్రమంలో అఖిల భారత బంజారా శక్తి పీఠ్ ధర్మ గురువు సంత్ బాబుసింగ్, బిజెపి రాష్ట్ర నాయకులు గుగులోతు వెంకన్న నాయక్ ఉన్నారు.