కరోనా ఉధృతి తగ్గడంతో కార్డుదారులకు మార్చి నెలలో బయోమెట్రిక్ తోనే రేషన్ బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని వరంగల్ కలెక్టర్ గోపి తెలిపారు. ఒక సభ్యుడు గల కార్డుదారుడితో పాటు వృద్ధులు, కుష్టు వ్యాధిగ్రస్తులకు, ఇద్దరు ఉన్న కార్డుదారులకు బయోమెట్రిక్ లేకున్నా OTPతో బియ్యం పొందవచ్చన్నారు. నేటి నుంచి EPOS మిషన్ల ద్వారా వేలిముద్రలు, IRISతో బియ్యంని రేషన్ షాపుల్లో పొందాలన్నారు.