వరంగల్: రికార్డు స్థాయిలో పత్తిధర

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ మూడు రోజుల సెలవుల అనంతరం సోమవారం పునః ప్రారంభమైంది. అయితే నేడు మార్కెట్‌కి పత్తి 2వేల బస్తాలు మాత్రమే వచ్చాయి. అదే విధంగా ధర రూ.9400 అవ్వడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని రైతులు వాపోయారు. ప్రభుత్వం పత్తి కొనుగోలు ధరలు పెంచి, రైతులను ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.