జగన్ చెప్పింది చేస్తే బిజెపి మునుగుతుందిగా…?

-

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చెయ్యాలనేది ముఖ్యమంత్రి జగన్ వ్యూహం. ఇప్పటికే రద్దుల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న ఆయన మండలిని కూడా రద్దు చేసే ఆలోచనలో ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. తనకు మండలి అనుకూలంగా లేదు కాబట్టి మండలిని రద్దు చేస్తారు బాగానే ఉంది. కనీసం విపక్షం గొంతుని అసెంబ్లీలో స్పీకర్ పైకి రానీయకుండా నొక్కేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.

మరి సభను రద్దు చెయ్యాలి కదా అనేది కొందరి వాదన. మూడు రాజధానులు అనేది జగన్ ఏకపక్ష నిర్ణయం అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. మూడు రాజధానుల విషయంలో ఆయన ప్రజాగ్రహాన్ని కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరనేది అర్ధమవుతుంది. రాజకీయంగా బలంగా ఉండటంతో సభలో ఆయన గొంతుకి శబ్దం ఎక్కువ. తనకు అనుకూలంగా ఉండేందుకు విశాఖను రాజధాని అంటున్నారు.

రాయలసీమ వాసుల ఆవేదనను గాని రాయలసీమ వాసుల ప్రయోజనాలుగాని జగన్ పట్టించుకోలేదు. నీకు నచ్చింది నువ్వు సభలో చేస్తున్నావ్ కాబట్టి తెలుగుదేశానికి నచ్చింది మండలిలో చేస్తుంది. దాంట్లో తప్పేమీ లేదు కదా…? నీ చేతిలో ఉన్నదీ నువ్వు చేసినప్పుడు ఆ పార్టీ చేతిలో ఉంది చంద్రబాబు చేస్తారు. దానికి రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకోవడం తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదైనా చెయ్యాలి అనుకోవడం.

దానికి ఎస్సీ కమీషన్ బిల్లు పెట్టడం అసలు చర్చలో లేని దాన్ని టీడీపీ అడ్డుకుంది అనడం జగన్ ఆలోచన ఏ విధంగా ఉంది అనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలి రద్దు కోసం కేబినేట్ తీర్మానం, తనకు బలం ఉంది కాబట్టి సభలో తీర్మానం, 2/3 వంతుల బలం కావాలి. అంతకు మించి బలం ఉంది కాబట్టి జగన్ నిర్ణయం తీసుకోవచ్చు. మరి పార్లమెంట్ ఉభయసభలకు బిల్లు వెళ్తుంది.

అక్కడ సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏ పరిస్థితుల్లో మండలిని రద్దు చేస్తున్నారు అనేది చెప్పాల్సి ఉంది. సరే అని ఉభయసభలు దానికి ఆమోదం తెలిపితే, బిజెపి ఇరుక్కుపోవడం ఖాయం. ఎందుకంటే బిజెపికి రాష్ట్రాల్లో బలం తగ్గుతుంది. అధికారం కోల్పోయిన మహారాష్ట్ర, ఝార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాల్లో మండలి రద్దు చెయ్యాలని ఆయా ప్రభుత్వాలు తీర్మానం ప్రవేశ పెట్టె అవకాశం ఉంది.

ఎపీని ఆమోదించి మిగిలినవి చేయకపోతే లేనిపోని అనుమానాలు వస్తాయి బిజెపి మీద. రాజ్యాంగ సవరణ కూడా చెయ్యాల్సి ఉంటుంది. మండలి రద్దు ప్రక్రియ అనేది అంత సులువు కాదు. అనవసరంగా జగన్ ఆవేశంగా నిర్ణయం తీసుకుంటే వైసీపీ దేశంలో అభాసుపాలు అవుతుంది. ఇప్పటికే ఏకపక్ష నిర్ణయాలతో కేంద్రానికి కూడా జగన్ సెగ తగిలింది కాబట్టి పార్లమెంట్ ఉభయసభల్లోను ఇది ముందుకి వెళ్ళే అవకాశం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news