ఎడిట‌ర్ నోట్ : చిన్న‌మ్మ.. అత్త‌మ్మ ఎవ‌రు గొప్ప‌!

-

ఇవ్వాల్సిన వారు ఇవ్వ‌డం లేదు. చెప్పాల్సిన వారు చెబుతున్నా కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు.ఈ ద‌శ‌లో నిర్మలా సీతారామ‌న్ అనే కేంద్ర మంత్రి మ‌న‌కు ఏమ‌యినా సాయం చేస్తారా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌ర విష‌యం.మ‌న‌కు అంటే తెలుగు రాష్ట్రాల‌కు.. ఇప్ప‌టికే విభ‌జ‌న చ‌ట్టం అమలులో ఏ పాటి శ్ర‌ద్ధ కూడా తీసుకోని కేంద్రం ఇక‌పై కూడా ఇదే విధంగా ఉంటే న‌ష్ట‌పోయేది ఈ రెండు రాష్ట్రాలే!ఈ ద‌శ‌లో కేంద్రం నుంచి రావాల్సిన రాబ‌ట్టాల్సిన‌వి ఏంట‌న్న‌వి పూర్తిగా తెలుసుకుని సంబంధిత ప్ర‌క్రియపై అటు జ‌గ‌న్ కానీ ఇటు కేసీఆర్ కానీ దృష్టి సారించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతయినా ఉంది.

విభ‌జ‌న చ‌ట్టం అమ‌లు మా బాధ్య‌త అని ఆ రోజు విప‌క్ష హోదాలో ఉంటూ బీజేపీ చెప్పిన మాట‌లే అమ‌లు కాలేదు ఇవాళ్టికీ.అంటే అధికారంలోకి రాగానే చిన్న‌మ్మా మ‌రియు అత్త‌మ్మా అన్నింటినీ మ‌రిచిపోయారా? వీళ్ల మాట‌లు నీటి రాత‌లేనా?

తెలంగాణ‌కు సంబంధించి ఇద్ద‌రు స్త్రీ మూర్తులు కీల‌కంగా ఉన్నారు. ఆ మాట‌కు వ‌స్తే రెండు తెలుగు రాష్ట్రాల‌కూ వారే కీల‌కం.ఒకరు సుష్మా స్వ‌రాజ్ మ‌రొక‌రు నిర్మ‌లా సీతారామన్.. విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిగా సుష్మ‌కు ఎంతో పేరు ఉండ‌గా, ఆర్థిక మంత్రిగా తెలుగింటి కోడ‌లు నిర్మ‌ల పేరు తెచ్చుకునేందుకు కాస్త ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌రికొన్ని విష‌యాల‌ను ఆ ఇద్ద‌రినీ పోల్చి చెప్పాలి. ఒక‌రు ఆ రోజు తెలంగాణ బిల్లును అన్నీతానై న‌డిపించారు.

ఆ రోజు చిన్న‌మ్మహోదాలో తెలంగాణ‌కు సంబంధించి ఎన్నో మాట‌లు చెప్పారు.అదేవిధంగా ఆంధ్రాకు సంబంధించి కూడా కొన్ని స్ప‌ష్ట‌మ‌యిన హామీల అమ‌లులోబీజేపీ ముందండ‌బోతోంద‌ని కూడా అన్నారు. ఇదంతా 2014కు ముందు క‌థ. ఆ త‌రువాత సీన్ మారిపోయింది. 2014 – 19, 2019 – 24 ఇలా వ‌రుస ప‌ద‌వీ కాలాల‌కు సంబంధించి బీజేపీనే అధికారంలో ఉంది. ఉండబోతోంది కూడా! అయితే ఈద‌శ‌లో నిర్మ‌లా సీతారామ‌న్ పాత్రే కీల‌కం. ఆర్థిక మంత్రిగా ఆమె చేయాల్సినంత చేయాలి కానీ చేయ‌డం లేదు.

నిన్న‌టి వేళ నిర్మ‌లా సీతారామ‌న్ ను మ‌రియు కేంద్రాన్ని ఉద్దేశిస్తూ కేటీఆర్ కొన్ని మాట‌లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల‌ను ఆదుకునే బాధ్య‌త కేంద్రానిదే అంటూ కీల‌కం అయిన ప్ర‌క‌ట‌న ఒక‌టి చేశారు. అయితే గ‌త కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల‌ను ప‌ట్టించుకుంటున్న దాఖ‌లాలు లేవు. ఆర్థిక‌లోటు పూడ్చేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌లు, జీఎస్టీ చెల్లింపులు అన్న‌వి పెద్ద‌గా స‌జావుగా సాగ‌డం లేదు.

ఈ ద‌శ‌లో కేంద్రంతో క‌య్యానికి కేసీఆర్ సిద్ధం అవుతున్నారు. తెలంగాణ‌ను ఆదుకున్న వైనం ఏమీ బాలేద‌ని,ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విష‌య‌మై తాత్సారం చేస్తూ వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని కేసీఆర్ దుయ్య‌బడుతున్నారు. ఈ త‌రుణంలో కొత్త బ‌డ్జెట్లో అయినా కేంద్రం క‌రుణిస్తుందా లేదా అన్న‌ది సందేహాస్ప‌దంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version