నిజం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన రోజు..తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం దక్కిన రోజు సెప్టెంబర్ 17. అందుకే ఇప్పటికీ తెలంగాణ ప్రజలు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తారు. అయితే తెలంగాణ ఏర్పాడ్డాక అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ ఎప్పుడు కూడా తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించలేదు. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తూనే వచ్చింది. అటు కాంగ్రెస్ కూడా అదే డిమాండ్ చేస్తూ వచ్చింది.
అయితే కేంద్రంలో అధికారంలోకి బీజేపీ సైతం డిమాండ్ చేయడమే తప్ప..కేంద్రం హయాంలో అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. కానీ తొలిసారి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. మొదట కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్ణయించడానికి రెడీ అయింది. పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది.
ఆ తర్వాత కేసీఆర్ సర్కార్ సైతం…తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవం పేరిట విమోచన దినాన్ని నిర్వహించడానికి రెడీ అయింది. అటు కాంగ్రెస్ సైతం ఏడాది పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని డిసైడ్ అయింది. అయితే మూడు పార్టీలు కూడా రాజకీయ కోణంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని క్లారిర్టీగా అర్ధమవుతుంది. ముఖ్యంగా బీజేపీ-టీఆర్ఎస్ పార్టీల మధ్య పోటాపోటీగా ఈ కార్యక్రమం జరగనుంది.
హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో అమిత్ షా, ఎన్టీఆర్ స్టేడియంలో కేసీఆర్‌ల ఆధ్వర్యంలో భారీ సభలు జరగనున్నాయి. ఈ సభలకు భారీ ఎత్తున ప్రజలని తరలించడానికి రెండు పార్టీల నేతలు ఇప్పటికే సన్నాహాలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ వేడుకల ద్వారా ఇటు కేసీఆర్, అటు అమిత్ షాలు ఎలాంటి రాజకీయ యుద్ధానికి తెరలేపుతారనేది చూడాలి. ఇప్పటికే బీజేపీ-టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ఇప్పుడు తాజాగా జరగబోయే కార్యక్రమంలో వీరు ఎలాంటి రాజకీయం నడుపుతారో అర్ధం కాకుండా ఉంది.
మొత్తానికి చూసుకుంటే రెండు పార్టీలు పేరుకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి గాని…ఎవరికి వారు రాజకీయ విమోచనం కోసమే పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో కేసీఆర్‌ని గద్దె దించి..తాము అధికారంలోకి రావాలని బీజేపీ, అసలు తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వకుండా చేయడం కాదు..ఆఖరికి కేంద్రంలో కూడా బీజేపీకి చెక్ పెట్టి..అక్కడ మోదీ సర్కార్‌ని గద్దె దించాలని కేసీఆర్ గట్టిగా ట్రై చేస్తున్నారు. అంటే ఎవరికి వారు..తమ ప్రత్యర్ధులని రాజకీయంగా విమోచనం చేయాలని చూస్తున్నారు. మరి చివరికి ఎవరు విమోచనం అవుతారో చూడాలి.