ఎడిట్ నోట్: జగన్‌కే రివర్స్?

-

గత ఎన్నికల ముందు ప్రతి అంశం రాజకీయంగా జగన్ కు కలిసొచ్చిందనే చెప్పాలి. అలా రాజకీయంగా ఉపయోగపడి ఎన్నికల్లో గెలవడానికి కలిసొచ్చింది. ఇక జగన్ రాజకీయంగా ఉపయోయగపడిన వాటిల్లో వివేకా హత్య కేసు ఒకటి అని చెప్పాలి. జగన్ సొంత బాబాయ్ వైఏ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసి హతమార్చారు. అయితే ఇది చేయించింది..చంద్రబాబు, టి‌డి‌పి నేతలే అని జగన్ తో సహ వైసీపీ నేతలు ఆరోపించారు.

మొదట గుండెపోటుతో చనిపోయారని చెప్పిన వైసీపీ నేతలు.ఆ తర్వాత హత్య అని తెలుసుకుని..బాబే ఇదంతా చేయించారని ప్రచారం చేశారు. వైసీపీ అనుకూల మీడియాలో కూడా బాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ కథనాలు వచ్చాయి. ఈ అంశం రాజకీయంగా బాబుకు మైనస్ అవ్వగా, జగన్‌కు బెనిఫిట్ అయింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక వివేకా కేసులో ఎన్ని ట్విస్ట్‌లు వచ్చాయి..జగన్ అధికారంలో లేనప్పుడు సి‌బి‌ఐ విచారణ కావాలని కోర్టుకు వెళ్ళి..అధికారంలోకి వచ్చాక ఆ పిటిషన్ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

 

కానీ వివేకా కుమార్తె సునీతా రెడ్డి మాత్రం సి‌బి‌ఐ విచారణ కోసం పోరాడారు. దీంతో కోర్టు కూడా విచారణకు అంగీకరించింది. ఇక సి‌బి‌ఐ విచారణ జరగడం..నిదానంగా నిజాలు బయటపడుతూ వచ్చాయి. ఇదే క్రమంలో ఇప్పటికే పలువురుని అరెస్ట్ చేసిన సి‌బి‌ఐ..తాజాగా వైఎస్ అవినాష్ రెడ్డి  తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.

ఇదే క్రమంలో మరొకసారి అవినాష్ రెడ్డిని విచారించడానికి నోటీసులు జారీ చేశారు. అలాగే ఆయన్ని వివేకా హత్య కేసులో నిందితుడుగా కూడా చేర్చారు. దీంతో అవినాశ్ రెడ్డి అరెస్ట్ కూడా ఖాయమని ప్రచారం వస్తుంది. అయితే తన  తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ పై అవినాశ్…సి‌బి‌ఐ లక్ష్యంగా విమర్శలు చేసిన  విషయం తెలిసిందే. అలాగే సునీతా, చంద్రబాబుతో చేతులు కలిపి ఇదంతా చేయిస్తుందని అవినాశ్ ఆరోపించారు. అలాగే వివేకాకు ముస్లిం స్త్రీతో అక్రమ సంబంధం ఉందని, ఆయన పేరు కూడా మార్చుకున్నారని అన్నారు. మొత్తానికి వివేకా హత్య కేసులో తనకేమి సంబంధం లేనట్లే అవినాష్ రెడ్డి చెప్పుకొచ్చారు.

కానీ ఇప్పుడు సి‌బి‌ఐ విచారణ నేపథ్యంలో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అవినాష్ ఎన్ని చెప్పిన వివేకా కేసులో ఏం జరుగుతుందో ప్రజలకు అర్ధమవుతుంది. ఈ పరిణామాలు జగన్‌కు రాజకీయంగా మైనస్ అవుతాయనే చర్చ కూడా సాగుతుంది. చూడాలి మరి వివేకా కేసు చివరికి ఏం అవుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news