ఎడిట్ నోట్: వైసీపీ ఓటమి..సీఎం సీటు..పవన్ ఛాయిస్?

-

మరొకసారి ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..కరెక్ట్ గా సమయం బట్టి ఏపీకి వచ్చి..వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న పవన్…తాజాగా చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించారు..ఈ కార్యక్రమం సత్తెనపల్లిలో జరిగింది. ఇక సత్తెనపల్లి వేదికగా పవన్..వైసీపీపై విరుచుకుపడ్డారు. అటు సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అంబటి రాంబాబుపై కూడా పవన్ ఫైర్ అయ్యారు. కౌలు రైతుల బీమా డబ్బుల్లో కమీషన్లు కొట్టేస్తున్నారని ఆరోపణలు చేశారు.

 

ఇదే క్రమంలో మరొకసారి వైసీపీ వ్యతిరేక ఓట్లని చీలనివ్వను అని, ఎట్టి పరిస్తితుల్లోనూ నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని చెప్పారు. జనసేనకు ఇంత బలం ఉండి కూడా గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల వైసీపీ గెలిచిందిని, 2014లోలాగే అదే కూటమి ఉండి ఉంటే వైసీపీ గెలిచినా శాసనసభలో బలమైన గొంతు ఉండేదని, కారణాలు ఏదైనప్పటికీ కొన్ని జరగలేదని, తాను మద్దతు పలికిన టీడీపీతోనే గొడవ పెట్టుకున్నవాడినని, వైపీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని మార్చి లో చెప్పానని, ఇప్పటికీ దీనికే కట్టుబడి ఉన్నానని చెప్పారు. నెక్స్ట్ ఎలాగైనా వైసీపీ ఓటమి ఖాయమని అన్నారు.

ఇక తనకున్న ఆప్షన్‌ ఒక్కటేనని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులను కలిపి ముందుకు తీసుకెళ్లడమని, కొత్త ప్రభుత్వాన్ని స్థాపించడం…తనని ముఖ్యమంత్రిని చేస్తారా లేదా అనేది తర్వాత అని,  మీ అందరి గుండెచప్పుడు బలంగా ఉంటే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పుకొచ్చారు. అంటే వైసీపీ ఓటమి, సీఎం సీటు రెండు జరగాలంటే అంతా ఈజీ కాదు. ఇక్కడ కొన్ని సమీకరణాలు ఉన్నాయి.

వైసీపీ ఓటమి గురించి అంటే..పవన్ ఖచ్చితంగా టీడీపీతో కలవాల్సిందే..బీజేపీతో కలిసి ముందుకెళితే అది జరిగే పని కాదు. టీడీపీతో పొత్తు ఉంటేనే..వైసీపీకి చెక్ పెట్టే అవకాశాలు దొరుకుతాయి. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు..ఖచ్చితంగా టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవాల్సిందే. ఇదే జరిగితే సీఎం సీటు అనేది పవన్‌కు దక్కడం అసాధ్యమైన పని..ఎందుకంటే టీడీపీ పెద్ద పార్టీ..చంద్రబాబు ఉన్నారు. సీఎం సీటు వదులుకుని పొత్తు పెట్టుకోవడం జరగదు. అంటే ఇక్కడ సీఎం సీటుని పవన్ త్యాగం చేయాల్సిందే. పోనీ రెండున్నర ఏళ్ళు బాబు, రెండున్నర ఏళ్ళు పవన్ సీఎం సీటుని పంచుకోవడం వల్ల అనిశ్చితి పరిస్తితులు వస్తాయి. కాబట్టి వైసీపీని ఓడించాలంటే పవన్ ఖచ్చితంగా సీఎం సీటు వదులుకుని టీడీపీతో పొత్తు పెట్టుకోవాలి. అలా కాకుండా బీజేపీతో కలిసి వెళితే వైసీపీ ఓటమి కాదు కదా..ఇంకా  ఆ పార్టీ గెలుపు అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి పవన్ ముందు ఉన్న ఆప్షన్ సీఎం సీటు వదులుకుని టీడీపీతో కలిసి వైసీపీ ఓటమి కోసం పనిచేయడం.

Read more RELATED
Recommended to you

Latest news