రూమ్‌లో హీటర్లు వాడుతున్నారా.. చికెన్‌ పాంక్స్‌, టీబీ, గుండెపోటు వచ్చే ప్రమాదం..

-

ఎండాకాలంతో వస్తే ఏసీలు.. చలికాలం వస్తే హీటర్లు కావాలనిపిస్తుంది. ఎండ నుంచి తప్పించుకోవడానికి ఏమైనా చేసుకోవచ్చు కానీ.. కొన్ని ప్రాంతాల్లో చలి నుంచి తప్పించుకోవడానికి కచ్చితంగా హీటర్లు వాడాల్సిందే. మనాలి లాంటి చల్లగా ఉండే ప్రాంతాల్లో కచ్చితంగా హీటర్లు వాడాల్సిందే. లేకుంటే అస్సలు రూమ్స్‌లో ఉండలేరు. అయితే ఈ హీటర్లను, బ్లోయర్‌ల వల్ల ఇన్‌స్టాంట్‌గా లాభం కలిగినట్టే అనిపించినా, వాటి వల్ల దీర్ఘ కాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం తప్పదని నిపుణులు అంటున్నారు. గంటల తరబడి హీటర్లు ఉన్న గదుల్లో గడిపితే పలు అనారోగ్య సమస్యలు తప్పవట.

హీటర్ లేదా బ్లోవర్ ఉన్న గది డోర్‌ను గంటల తరబడి మూసి ఉంచడం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. కిటికీలు మూసివేయడం వల్ల గదిలో ఉండే ఆ వేడీ శరీరంపై చెడు ప్రభావం చూపిస్తుంది. గదిలో ఆక్సిజన్‌ శాతం తగ్గుతుంది. దాని వల్ల ఊపిరాడకపోవడం, వికారం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంలో ఇది గుండె పోటుకు కూడా కారణం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పరిష్కారం లేదా..?

ఇక ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే గదిలో హీటర్‌ను ఉపయోగిస్తే కచ్చితంగా కిటికీలు తెరిచి ఉండాలి. దీని ద్వారా సరైన వెంటిలేషన్‌ ఉంటుంది. గది ఉష్ణోగ్రత బ్యాలెన్స్‌ అవుతుంది.. హీటర్లు ఉన్న గదిలో గంటల తరబడి ఉంటే చికెన్ పాక్స్, టీబీ వంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇక సాధారణ సమయాల్లోనూ ఇంట్లో సరైన వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవాలి. గదిలో ఉండే గాలి బయటకు వెళ్లేలా, బయట గాలి లోపలికి వచ్చేలా చేసుకోవాలి. వీలైనంత వరకూ నైట్‌టైమ్‌లో హీటర్లను ఆపేయడం లేదా.. స్వీడ్‌ తగ్గించుకోవడం చేయాలి. అలాగే హీటర్ల దగ్గర బట్టలు పెట్టుకోకూడదు. ఆ వేడి బట్టలకు తగిలి.. నిప్పు అంటుకునే ప్రమాదం ఉంది. నిద్రలో నిప్పు అంటుకుంటే.. గది మొత్తం వ్యాపిస్తుంది. హీటర్లను వాడే రూమ్‌లో చాలా జాగత్తలు తీసుకోవాలి. కిటీకీలకు దగ్గరగా హీటర్‌ పెడితే.. ఆ కటన్స్‌ గాలికి వచ్చే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news