సీడీఏసీలో ఉద్యోగాలు… ఇలా అప్లై చేసుకోండి..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. పుణెలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పలు పోస్టులని భర్తీ చేయనున్నారు. ఇక ఈ పోస్టులకి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

 

దీనిలో మొత్తం ఖాళీలు 259 ఖాళీలు వున్నాయి. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో తమ అనుభవాన్ని పొందపర్చాలి. జనరల్ అభ్యర్థులకు రూ.500 ఫీజు, మహిళలకు, ఎస్సీ ఎస్టీ అభ్య‌ర్థుల‌కు ద‌ర‌ఖాస్తు రుసుము లేదు.

పోస్టుల వివరాలు:

ప్రాజెక్ట్ ఇంజీనీర్ – 249
ప్రాజెక్ట్ అసోసియేట్‌ – 4
ప్రాజెక్టు స‌పోర్ట్ స్టాఫ్ – 6

ప్రాజెక్ట్ ఇంజీనీర్ పోస్టులకి అప్లై చేసుకోవాలని అనుకుంటే.. ఖచ్చితంగా బీఈ, బీటెక్ లేదా సంబంధిత కోర్సులో ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చి ఉండాలి. అదే ప్రాజెక్ట్ అసోసియేట్‌ పోస్టుకి అయితే బీఈ, బీటెక్ లేదా సంబంధిత కోర్సు లో ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చి ఉండాలి.

ఇది ఇలా ఉంటే ప్రాజెక్టు స‌పోర్ట్ స్టాఫ్ పోస్ట్ కి అప్లై చేసుకోవాలంటే 50శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. https://www.cdac.in/index.aspx?id=job_Cons_Sep_2021 లో పూర్తి వివరాలని చూసి అప్లై చేసుకోవచ్చు. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ సెప్టెంబ‌ర్ 25.

Read more RELATED
Recommended to you

Exit mobile version