టెన్త్, డిగ్రీ, పీజీ, డిప్లొమా అర్హతతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చెయ్యండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఏపీలో నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. అనంతపురం జిల్లాలోని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే..

 

jobs
jobs

వన్ స్టాప్ సెంటర్ లో పలు ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా అప్లై చేసుకోవాలి. ఇక ఖాళీల వివరాలను చూస్తే.. పారా మెడికల్ పర్సనల్ లో కాళీలున్నాయి. నర్సింగ్ కోర్సులో మూడేళ్ల డిగ్రీ/డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అలానే ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర హెల్త్ ప్రోగ్రామ్/ప్రాజెక్టులో మూడేళ్ల పాటు అనుభవం తప్పనిసరి. వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి.

అలానే కౌన్సెలర్ విభాగం లో కాళీలున్నాయి. సోషల్ వర్క్ లేదా క్లినికల్ సైకాలజీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుండాలి. కౌన్సెలర్ గా ఫిజియోథెరపిస్ట్ గా పని చేసిన అనుభవం ఉండాలి. వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి.

అదే విధంగా సెక్యూరిటీ గార్డ్ పోస్టులున్నాయి. టెన్త్ విద్యార్హతతో పాటు ప్రభుత్వ లేదా పేరొందిన సంస్థలో రెండేళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి. వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. దరఖాస్తులను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.

https://cdn.s3waas.gov.in/s333e8075e9970de0cfea955afd4644bb2/uploads/2021/11/2021110136.pdf

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news