మారటోరియం కాలంలో రుణాలపై వడ్డీపై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది..రుణ మారటోరియం కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం విచారణ అక్టోబర్ 13 కి వాయిదా వేసింది..కరోనా సమయంలో ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మార్గదర్శకాలను పూర్తి వివరాలతో వివరిస్తూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడానికి ధర్మాసనం ప్రభుత్వానికి మరో వారం రోజుల సమయం ఇచ్చింది.
లాక్‌డౌన్ సందర్భంగా రుణాలకు సంబంధించి ఆరు నెలలపాటు విధించిన మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీ మాఫీ విషయంలో తన నిర్ణయాన్ని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది. మారటోరియం సమయంలో కొన్ని రకాల రుణాలపై వడ్డీ వదులుకునేందుకు సిద్ధమని స్పష్టం చేసింది కేంద్రం. మారటోరియం కాలంలో రూ.2 కోట్ల వరకు గల రుణాలపై వడ్డీ వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు కోర్టుకు వివరించింది.
మారిటోరియం కాలంలో క్రమం తప్పకుండా రుణాలు చెల్లించిన వారి కోసం క్యాష్ బ్యాగ్ విధానాన్ని తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు అఫిడవిట్లులో కోర్టుకు తెలిపారు..విశ్వసనీయ సమాచారం ప్రకారం రూ.2 కోట్లలోపు రుణాలు తీసుకుని, క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లించిన వ్యక్తిగత వినియోగదారులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కూడా ప్రయోజనం కలిగించే విధంగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మారటోరియం కాలంలో వడ్డీపై విచారణ 13కు వాయిదా..
-