వ‌న్డే అప్డేట్ : టాస్ ఎవ‌రిది అంటే?

ఇవాళ దక్షిణాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య మూడో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ కేప్‌ టౌన్‌ వేదికగా జరుగుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. అయితే.. ఇందులో టాస్‌ నెగ్గిన టీమిండియా మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదటి బ్యాటింగ్ చేయనుంది సౌతాఫ్రికా జట్టు.

ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్ (w), టెంబా బావుమా(సి), ఐడెన్ మార్క్‌రామ్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, డ్వైన్ ప్రిటోరియస్, లుంగి ఎన్‌గిడి, సిసంద మగల

భారత్ (ప్లేయింగ్ XI): KL రాహుల్ (c), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్