అంతర్జాతీయ యోగా దినోత్సవం.. జూన్ 21నే ఎందుకు జరుపుకుంటారు?

-

యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. యోగా వల్ల కలిగే ఆ ప్రయోజనాల గురించి ప్రజలను చైతన్యం చేయడమే యోగా డే ముఖ్య ఉద్దేశం.

వచ్చే శుక్రవారమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. అయితే.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21నే ఎందుకు జరుపుకుంటారు? అసలు.. ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడు స్టార్ట్ అయింది.. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

 

యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. యోగా వల్ల కలిగే ఆ ప్రయోజనాల గురించి ప్రజలను చైతన్యం చేయడమే యోగా డే ముఖ్య ఉద్దేశం. యోగా అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. యుజ అనే పదం నుంచి వచ్చింది. యుజ అంటే దేన్నయినా ఏకం చేయడం.. లేదా చేరడం అని అర్థం. అంటే.. శరీరాన్ని, మనసును ఏకం చేయడమే యోగా ఉద్దేశం అన్నమాట. అందుకే.. ఆ పదాన్ని తీసుకున్నారు. యోగా ఇప్పటిదేమీ కాదు.. దాదాపు 5000 ఏళ్ల నాటి చరిత్ర ఉంది యోగాకు. యోగాకు సంబంధించిన యోగశాస్ర్తాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది భారతీయులే. అందుకే.. యోగాను ప్రపంచ వ్యాప్తం చేయడం కోసం ప్రతి సంవత్సరం యోగాడేను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఒక నినాదంతో యోగా డేను నిర్వహిస్తారు.

 

జూన్ 21నే ఎందుకంటే?

జూన్ 21నే యోగాడేను జరుపుకోవడానికి పేద్ద కారణమే ఉంది. జూన్ 21.. ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. అంటే డే సమయం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు ప్రత్యేకత కూడా ఉంటుంది. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో.. అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి ప్రధాని మోదీ సూచించారు.

2014లో మోదీ ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించడంతో… తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015లో నిర్వహించారు. 2015, జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా మొదటి అంతర్జాతీయ యోగా డేను నిర్వహించారు. భారత్‌లో ప్రధాని మోదీ.. న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించారు. ఆ వేడుకలకు చాలా దేశాలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఆరోజు ప్రధాని మోదీతో పాలు వేల మంది యోగా చేశారు. 84 దేశాల నుంచి వచ్చిన నేతలతో పాటు మొత్తం 35985 మంది ఆరోజు మోదీతో పాటు యోగా చేసి రెండు గిన్నిస్ రికార్డులను నెలకొల్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version