2023- 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మోదీ సర్కార్ కొత్త బడ్జెట్‌ను తీసుకురానుంది. ఈసారి బడ్జెట్‌పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. కొత్త బడ్జెట్ సామాన్యులకు ఊరట కలిగిస్తుందని తెలుస్తుంది.. రైతులతో పాటు నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ పెట్టారు.. ఈ మేరకు కొత్తగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విషయానికొస్తే.. 770 ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 38800 ఉపాద్యాయ పోస్టుల భర్తీ చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆదివాసీ ప్రాంతాల్లో మౌలిక సందుపాయాల కోసం రూ.15 వేల కోట్లు కేటాయించనున్నారు..
ఈ మేరకు ఏకలవ్య పాఠశాలల్లో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు. డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. 157 నర్సింగ్ కళాశాలల ఏర్పాటు చేస్తామన్నారు. రూ.2,200 కోట్లతో ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాన్ ప్రోగ్రామ్ చేపడతామన్నారు. ఫార్మా రంగం లో పరిశోధనల కోసం సరికొత్త ఫార్మా ప్రోగ్రామ్ చేపట్టనున్నట్లు చెప్పారు. మత్స్యకారుల కోసం రూ.6,000 కోట్లతో పీఎం సంపద యోజన ను ప్రకటించారు..
ఇకపోతే పలు ప్రొడక్టుల పై దిగుమతి సుంకాలను పెంచొచ్చని తెలుస్తోంది. మేకిన్ ఇండియాను ప్రోత్సహించడానికి, దేశీయంగా ఉన్న తయారీదారులకు ఊరట కలిగించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి.. పూర్తి బడ్జెట్ ఎవరికీ అనుకూలంగా ఉంటుందో చూడాలి..