మీ నుండి దూరంగా వెళ్ళేవాళ్ళని వెళ్లనివ్వండి… బాధ ఏం వద్దు..!

-

ఓసారి మన జీవితంలో చేదు అనుభవాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. మన జీవితంలో నుంచి కొంతమంది వ్యక్తులు దూరమైపోతూ ఉంటారు. ఇలాంటి సమయంలో బాధపడాల్సిన పనిలేదు. కొంతమంది ఎదుటివారి మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుని దూరం అయి పోతూ ఉంటారు.

 

అలాంటి వాళ్ళు వెళుతున్నప్పుడు అసలు బాధపడకూడదు. అయితే కొంతమంది మన నుండి దూరం అయిపోయిన తర్వాత మన గురించి ఏవేవో కథలు చెప్తూ ఉంటారు. అవన్నీ నిజం కాకపోవచ్చు. అలా వెళ్లిన వ్యక్తి ఇష్టానుసారంగా నచ్చింది చెప్పడం వల్ల మనకైతే నష్టం లేదు. అయితే అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు.

కొంతమంది మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుని వాడుకుని మనకు దూరం అవుతారు. ఇలాంటి వాళ్ళు బై చెప్తే తిరిగి మనం కూడా బై చెప్పడం మంచిది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని పట్టుకుని కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు. వారికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. పైగా వాళ్ళకి వాళ్ళు చేసింది తప్పు అని తెలిసినప్పటికీ కూడా అలానే ఉంటారు.

ఆ తప్పును అస్సలు ఒప్పుకోరు కూడా. అటువంటప్పుడు మనం చేసేదేమీ లేదు వెళ్ళేవాళ్ళని వెళ్లనివ్వాలి. జీవితంలో చాలా మంది వ్యక్తులు వస్తూపోతూ ఉంటారు. చక్కగా మీతో వుండే వ్యక్తులు మీరు ఎంత పెద్ద తప్పు చేసినప్పటికీ సర్దుకుపోయి మీతో కలిసి ఆనందంగా ఉంటారు అంతేకానీ మీదే తప్పంటూ మీ నుండి దూరం అయిపోతుంటే మీరు ఎటువంటి బాధ పడక్కర్లేదు.

అనవసరంగా వారి గురించి ఆలోచించి సమయం వృధా చేసుకోకండి. వాళ్లు వాళ్లకు నచ్చిన చోటికి వెళ్తారు. వాళ్ల గురించి అసలు ఆలోచించకండి. మనసు పాడవుతుంది తప్ప ఫలితం ఏమీ ఉండదు. నిజానికి అదే మీకు మంచిది.

ప్రతిరోజూ ఆనందం కష్టం రెండు ఉంటాయి. ఏది ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేము కాబట్టి ఉన్నంతవరకు జీవితంలో సంతోషంగా ఉండండి. వెళ్లి పోతున్న వ్యక్తుల గురించి ఆలోచించడం బాధపడటం వలన మీకే నష్టం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news