ఊపిరితిత్తులను మెరుగుపరిచే 5 రకాల బ్రితింగ్ ఎక్సర్‌సైజ్‌లు..!

-

కరోనా కారణంగా దేశం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే చాలా మంది బాధితులు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వైరస్ మనిషి శరీరంలో ప్రవేశించిన తర్వాత అనేక అవయవాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ఇందులో ముఖ్యంగా ఊపిరితిత్తులపై ప్రభావం ఎక్కువ. దీంతో కరోనా బాధితులకు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. అయితే కరోనా వైరస్ శరీరంలో వాయు మార్గాల ద్వారా ప్రవేశించినప్పుడు చికాకు, మంట కలిగిస్తుంది. అప్పుడు బాధితులు మరింత అప్రమత్తంగా ఉండాలి. కరోనా బాధితులు ఇంట్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం, ఆహారం, వ్యాయామంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. శ్వాసకోస వ్యవస్థను మెరుగుపరిచే వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంపొందించవచ్చు. 5 రకాల బ్రితింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తే.. ఊపిరితిత్తులను మెరుగుపర్చవచ్చు. ఫలితంగా శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది.

ఊపిరితిత్తులు
ఊపిరితిత్తులు

బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్..

ఇది చాలా సులభమైన, ముఖ్యమైన వ్యాయామాలలో ఒకటి. ఇది మీ ఊపిరితిత్తులను బలోపేతం చేయడానికి, రక్త ప్రవాహాన్ని పెంచడానికి, రోగనిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ అంటే.. ముక్కు ద్వారా గాలిని పీల్చి నోటి ద్వారా వదలం, నోటి ద్వారా గాలి పీల్చి ముక్కు ద్వారా వదలడం, అలాగే.. నోటి ద్వారా గాలిని పీల్చి నోటి ద్వారా వదలడం, ముక్కు ద్వారా గాలి పీల్చి ముక్కు ద్వారా వదలడం. ఇలా రోజూ 10-15 నిమిషాల పాటు ఈ ఎక్సర్‌సైజ్ చేసినట్లయితే మీ ఊపిరితిత్తులు తొందరగా మెరుగుపడతాయి.

ఉదర శ్వాస..

ఇది కూడా ప్రత్యేకమైన వ్యాయామమే. ఈ వ్యాయామం చేయడం వల్ల నిరాశ, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు తగ్గుతాయి. ముక్కు ద్వారా గాలిని పీల్చి కడుపులో బంధించాలి. అలా 10-15 నిమిషాలపాటు ఉదర శ్వాస ఎక్సర్‌సైజ్ చేయాలి. ఈ పద్ధతి ద్వారా ఊపిరితిత్తులకు గరిష్ట సామర్థ్యం చేకూరుతుంది.

హార్ట్ ఎక్సర్‌సైజ్..

గుండెకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. దీని వల్ల శ్వాసకోశ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. రోజూ జాగింగ్, వాకింగ్, జంపింగ్, మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాలు చేయడం మంచిది. దీంతో శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఆక్సిజన్ స్థాయి మెరుగుపడుతుంది.

బ్రహ్మరి..

సంస్కృతంలో బ్రహ్మరి అంటే తేనెటీగ అని అర్థం. ఇది హమ్మింగ్ వ్యాయామం. ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను పెంచుతుంది. అలాగే వాసోడైలేటర్లుగా పనిచేస్తుంది. నాళాల ద్వారా సులభంగా రక్త ప్రవాహానికి సహాయపడుతుంది. కండరాలను బిగించకుండా నిరోధిస్తుంది. ఒక ధ్యాన స్థితిలో కుర్చీ మీద లేదా నేల మీద కాళ్లు మీద కూర్చోవాలి. ‘హ్మ్’ అని శబ్దం చేస్తున్నట్లు గాలిని తీసుకుని వదలాలి. ఇలా 10 నుంచి 15 నిమిషాలపాటు చేయాలి. ఈ వ్యాయామాలు కోవిడ్ నివారణకు సహాయపడతాయి. ప్రతిరోజూ ఈ వ్యాయామాలు చేయడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. కరోనా బాధితులు రోజూ ఈ వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. ఫలితంగా కరోనా నుంచి తొందరగా క్యూర్ అవ్వొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news