ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ నీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా వైరస్ గా అభివర్ణించారు. చాలా వరకు ప్రపంచ దేశాల నాయకులు ఇది చైనా కుట్రపూరితంగా ప్రపంచం మీదికి వదిలిన భయంకరమైన వైరస్ అని ఆరోపిస్తున్నారు. చైనా దేశం వ్యూహన్ పట్టణంలో ఈ వైరస్ భయంకరంగా విజృంభించి అనేక మందిని పొట్టన పెట్టుకుంది. ఆ సందర్భంలోనే ఇజ్రాయెల్ దేశం ఇంటెలిజెన్స్ వ్యూహన్ ల్యాబ్ నుండి కుట్రపూరితంగా చైనా ఈ వైరస్ ని ప్రపంచం మీదికి వదిలింది అని ఆరోపించింది.ప్రస్తుతం ప్రపంచంలో 200 దేశాలకు పైగానే ఈ వైరస్ వ్యాపించి ఉంది. ఇటువంటి సందర్భంలో ఇటీవల ఇండియా దేశంలో కొన్ని రాష్ట్రాలలో కరోనా వైరస్ టెస్టింగ్ కిట్స్ నీ చైనా దేశం నుండి కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఈ కిట్స్ పని తనం చూస్తే… వైరస్ పాజిటివ్ కలిగిన వ్యక్తి ని టెస్టింగ్ చేస్తుంటే నెగిటివ్ అని చూపిస్తున్నాయి. దీంతో ఆ వ్యక్తి వైరస్ కలిగి కారియర్ గా మరి అనేక మందికి ఈ వైరస్ ని అంటించే వ్యక్తి లాగా తయారవుతున్నాడు.
అయితే ఈ విషయం ముందుగానే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పసిగట్టడం తో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వెంటనే చైనా దేశంలో ఈ టెస్టింగ్ కిట్స్ పంపించిన కంపెనీలను ప్రశ్నించగా… అలాంటి తప్పు జరగదని బుకాయించాయి. వెంటనే టెస్ట్ చేసిన రిపోర్ట్స్ తో సహా… కిట్స్ పనితనాన్ని వీడియో రూపం లో పంపించగా వెంటనే తప్పు ఒప్పుకున్నాయి. మొత్తంమీద చైనా యొక్క వ్యవహారం చూస్తుంటే తప్పు ఇతరులపై నెట్టి వేయడమే పనిగా పెట్టుకున్నట్టు వ్యవహరిస్తున్నాయి. కరోనా విషయం లో కుట్ర పూరితంగా డ్రామాలు ఆడుతున్నట్లు అర్ధమవుతుంది. దీంతో చాలా వరకు కేంద్ర ప్రభుత్వం చైనా దేశం నుండి వచ్చే కరోనా వైద్య పరికరాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యింది.