కరోనా కేసుల పెరుగుదలతో కేంద్రం అలెర్ట్

-

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. తన రూపాలను మారుస్తూ ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్, ఎక్స్ ఈ ఇలా కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం దేశంలో గత కొన్ని రోజులుగా తక్కువ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో కరోనా కేసుల్లో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా  ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ఫోర్త్ వేవ్ వస్తుందా… అనే అనుమానాలు వస్తున్నాయి. 

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన కేంద్రం పలు రాష్ట్రాలకు గైడ్ లైన్స్ జారీ చేసింది. హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, మిజోరం రాష్ట్రాలకు లేఖ రాసింది. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ఆందోళన కలిగించే ప్రాంతాల్లో అవసరమైతే కఠినంగా వ్యవహరించాలని ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరింది. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని, భారీ మొత్తంలో పరీక్షలు చేయాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news