ఏడు రాష్ట్ర ప్రభుత్వాలతో పీఎమ్ మోదీ సమావేశం.. ఏం మాట్లాడతారంటే?

-

నేడు ప్రధానమంత్రి మోదీ ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ముచ్చటించనున్నారు. ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. ఈ ఏడు రాష్ట్రాలలో కరోనా కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దేశంలో 63శాతం కేసులు ఈ ఏడు రాష్ట్రాల నుండే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాలకి కేంద్ర సాయం అవసరం అన్న ఉద్దేశ్యంతో చర్చలు జరగనున్నాయి.

కరోనా నియంత్రణలో కేంద్ర మార్గదర్శకం అవసరమా అన్న నేపథ్యంలో సమావేశం జరగనుంది. ఇటీవల జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక బృందాలని పంపిన సంగతి తెలిసిందే. మరో వైపు ఢిల్లీలీనూ ఉమ్మడి బృందం పనిచేస్తుంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు 56లక్షలకి చేరువ అయ్యాయి. మృతుల సంఖ్య 90వేలకి పైగానే ఉంది. రికవరీ అవుతున్న వారి సంఖ్య పెరుగుతున్నా రోజూ అధికమవుతున్న కేసులు ఆందోళనకరంగా మారాయి.

దేశం మొత్తం మీద మహారాష్ట్రలో కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. మంగళవారం ఒక్కరోజే 18,390 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మొత్తం కేసులు 1,242,770గా ఉన్నాయి. మరి కరోనా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడు రాష్ట్రాలకి ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news