మన పిల్లలు బడికి వెళ్లి చదువుకోవాలి; రోహిత్ ట్వీట్

-

కరోనా వైరస్ ఇప్పుడు తీవ్ర స్థాయిలో విస్తరిస్తుంది. మన దేశంలో కూడా క్రమంగా ఈ వైరస్ మెల్లగా విస్తరించడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. దీనితో అందరూ కరోనాపై పోరాటం పెద్ద ఎత్తున చేస్తున్నారు. మన దేశంలో అన్ని రాష్ట్రాలు ఇప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. పలు రాష్ట్రాలు షట్ డౌన్ ప్రకటించాయి. దీనిపై ప్రపంచం మొత్తం ఇప్పుడు ఉమ్మడిగా పోరాట౦ చేస్తుంది.

ఈ నేపధ్యంలో టీం ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసాడు. నేను మీకు పలు విషయాలు చెప్పదల్చుకున్నా… గతకొన్ని వారాలు మనందరికీ ఎంతో కఠినంగా గడిచాయి. కరోనా వైరస్‌ తో ప్రపంచమంతా ఒకేతాటిపైకి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు చూడటం చాలా బాధగా ఉంది. మనమంతా వాస్తవిక జీవన పరిస్థితులకు రావాలంటే కలిసికట్టుగా పోరాడాల్సి ఉంటుంది.

కొంచెం చురుకుగా వ్యవహరిస్తే ఈ పరిస్థితులను ఎదుర్కోవచ్చు అని ట్వీట్ చేసాడు. అదే విధంగా పరిసరాలను గమనిస్తూ, ఎవరికైనా వైరస్‌ లక్షణాలు కనిపిస్తే దగ్గర్లోని వైద్యాధికారులను సంప్రదించాలని సూచించాడు. ఎందుకంటే మన పిల్లలు బడికెళ్లి చదువుకోవాలని, మనం మన పనులు చేసుకోవాలని భావోద్వేగంగా ట్వీట్ చేసాడు. వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి వారిని కాపాడుతున్నారని కొనియాడాడు.

Read more RELATED
Recommended to you

Latest news