women’s day: విజయ గాథ.. మహిళల వెనుక విజయం మరో మహిళ

-

వీరి చేసే వంట అద్భుతం, అమోఘం. ఢిల్లీలో ఎక్కడ ఈవెంట్ జరిగినా వీరికే ఆర్డర్ వస్తుంది.ఇక్కడ పనిచేసేవారంతా మహిళలే. వీరు భారతీయులు కాదు. భారతీయులంటే ఆపారమైన ప్రేమ. ఈ మహిళల విజయానికి కారణం మరో మహిళ కావడం విశేషం.

ఏడాది క్రితం ఆఫ్ఘనిస్తాన్‌లోని మిలిటెంట్ ఔట్‌ఫిట్ తాలిబాన్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన కొందరి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారికి భారత్‌లో ఆశ్రయం దొరికింది. కుటుంబాన్ని పోషించే బాధ్యత భార్యలపై పడింది. ఆఫ్ఘనిస్తానీ మహిళలు చదువుకోలేదు. వీరికి భాష రాదు. దీంతో ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. వీరంతా ఏడుమంది ఉన్నారు. వీరందరిలో కామన్ పాయింట్ వంట. అందరికీ వంట చేయడం అంటే ఇష్టం. దేన్నైనా చేస్తే ఇట్టే పట్టేస్తారు. ఏడుమంది ఒకచోట చేరారు. వీరికి తెలిసిన వంటలు తయారుచేసి అమ్మడం మొదలుపెట్టారు. కొత్తగా పెట్టడంతో కస్టమర్లు పెద్దగా వచ్చేవారు కాదు. వీరికి కస్టమర్లను అట్రాక్ట్ చేసేంత అనుభవం లేదు. ఈ ఫీల్డ్ కొత్త. ఒకవైపు కుటుంబ పరిస్థితులు మరోవైపు ఆదాయం లేదు. ఆర్థికపరిస్థితులతో సతమవుతున్నారు. అలాంటి సమయంలేనే వీరిపై అదితి కన్ను పడింది.

వంటలకు గుర్తింపు..

అదితి ఇహామ్ సంస్థ స్థాపకురాలు. ఇది 2015లో యుఎన్‌హెచ్‌సిఆర్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ లవ్లీహుడ్స్ ప్రాజెక్ట్ కింద నడుస్తుంది. ఇఫ్ఘానీ మహిళలను ఇహామ్‌లో తీసుకున్నది. వీరికి రకరకాల వంటలపై శిక్షణ ఇప్పించింది. వీరికి ఉపాధి పెంచేలా చేసింది. వీరి వంటలకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. ఇక్కడి వచ్చిన కస్టమర్లు మరలా తప్పకుండా వస్తారు. అలా ఉంటాయి వీరి వంటలు. కస్టమర్లను వంటల రుచితో కట్టిపడేస్తారు. దీనికి ఆన్‌లైన్ ఆర్డర్ ఉంది. అంతేకాదు వాట్సప్ ఆన్‌లైన్ షాపింగ్ ఎలానో వాట్సప్ ఫుడ్ ఆర్డర్ సౌకర్యం కూడా ఉంది. వీరు చేసే వంటల్లో నర్గిషి, షామి కబాబ్, కబూలి, నోరంజ్ పులావ్ చాలా ఫేమస్. ఆఫ్ఘానీ మహిళలో ఒకరి భర్తకు పులావ్ అంటే చాలా ఇష్టమట.

ఆమె పులావ్ స్పెషలిస్ట్. ఢిల్లీ యూనివర్సిటీలో జరిగే ఫెస్టివల్స్, ఈవెంట్స్‌కు అహామ్‌కే క్యాటరింగ్ అప్పచెబుతున్నారు. కస్టమర్ల రాకతో అఫ్ఘానీ మహిళలకు ఆత్మవిశ్వాసం ఏర్పడింది. సంతోషాంగా కుటుంబాన్ని చూసుకుంటున్నారు. దీనంతటికీ కారణమైన అదితికి కృతజ్ఞతలు తెలిపారు. 2018 మార్చిలో ఢిల్లీ ఫుడ్ వాక్ అండ్ అమెరికన్ సెంటర్ ఇహామ్‌కు బెస్ట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా అవార్డునిచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news