అటు పిల్లలు.. ఇటు పని.. మధ్యలో వర్కింగ్ మామ్స్.. జాబ్స్ కోల్పోతున్నారా..?

-

కరోనా వచ్చి అన్నింటినీ అతలాకుతలం చేసేసింది. కరోనా వల్ల ఆఫీసులకి వెళ్లడం కుదరక ఇంట్లోనే ఉండి ఆఫీసు పని చేసుకుంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విపరీతంగా పెరిగింది. ఐతే వర్క్ ఫ్రమ్ హోమ్ మగవాళ్లకి సౌకర్యంగానే ఉన్నా ఆడవాళ్ళకి, మరీ ముఖ్యంగా వర్కింగ్ మామ్స్ కి పెద్ద సవాలుగా మారింది. ఇంటి పనులతో పాటు ఆఫీసు వర్క్ చేయడం వారికి అలవాటే అయినప్పటికీ పిల్లల బాధ్యత ఆఫీసు వర్క్ మీద బాగా ప్రభావం చూపిస్తుంది.

10సంవత్సరాల లోపు పిల్లలు స్కూళ్ళు లేక ఇంట్లోనే ఉండడంతో వారి బాధ్యతలు చూసుకోవడంతో ఆఫీసు వర్క్ మీద శ్రద్ధ చూపలేకపోతున్నారు. ఇంకా ఒకరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారి పరిస్థితి ఇంకా కఠినంగా ఉంది. అటు వృత్తి పరంగా సరిగా న్యాయం చేయలేకపోతున్నారు. కొంతమేర హజ్బెండ్స్ ఆ బాధ్యత పంచుకుంటున్నప్పటికీ హజ్బెండ్స్ కూడా ప్రొఫెషనల్ గా బిజీగా ఉండడం, ఇద్దరి పని వేళలు మ్యాచ్ అవ్వడం వల్ల తల్లులకి కష్టంగా మారుతుంది.

ఈ మేర వర్కింగ్ మామ్స్ పై ఒక సర్వే నిర్వహించారు. అందులో ఎక్కువ శాతం మంది తమ పిల్లల బాధ్యత వృత్తి మీద ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పారట. ఈ నేపథ్యంలో పనిగంటలు తగ్గించుకుంటున్నారట. కరోనా టైమ్ కాబట్టి ఫ్రెండ్స్ సహా కుటుంబ సభ్యులు కూడా సాయం చేయడానికి రావడం లేదట.

మొత్తానికి రెండింటినీ బ్యాలన్స్ చేయడం కష్టంగా మారింది. ఐతే హజ్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరి పనివేళలు వేరు వేరుగా ఉంటే కొంచెం ఫర్వాలేదని చాలామంది వర్కింగ్ ఉమెన్స్ అభిప్రాయపడుతున్నారు. పిల్లల బాధ్యత కారణంగా చాలామంది వర్కింగ్ మామ్స్ తమ ఉద్యోగాలని కోల్పోతున్నారట. ఈ విషయంలో కంపెనీలు వర్కింగ్ మామ్స్ కి కొన్ని వెసులుబాటులు కల్పిస్తే బాగుంటుందని సర్వే అభిప్రాయ పడింది.

Read more RELATED
Recommended to you

Latest news