ఫ్యాక్ట్ చెక్: ఇండియన్ ఆయిల్ లక్కీ డ్రాను నిర్వహిస్తుందా?

-

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు చక్కర్లు కొడుతూన్నాయి..కొన్ని మంచివి అయితే మరి కొన్ని జనాలను మోసం చేస్తున్నాయి.. ఫేక్ న్యూస్ లు ఎక్కువ దర్శనమిస్తున్నాయి..అబద్ధాలను అడ్డగోలుగా ప్రచారం చేస్తూ నిజమేదో, అబద్ధమేదో తెలుసుకోలేని గందరగోళ స్థితిలోకి ప్రజలను నెట్టేస్తున్నాయి ఈ వార్తలు.ఇప్పటి వరకూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇప్పుడు మరో వార్త సంచలనంగా మారింది..అదేంటంటే.. ప్రముఖ ఆయిల్ కంపెనీ ఇండియన్ లక్కీ డ్రాను నిర్వహిస్తుందనే వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేరిట ఒక లక్కీ డ్రా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒకరి వ్యక్తిగత వివరాలను కోరిన తర్వాత రూ. 6,000 విలువైన ఇంధన సబ్సిడీ బహుమతిని గెలుచుకునే అవకాశాన్ని అందిస్తోందని ఆ మెసేజ్ లో ఉంది.

ఈ ఫేక్ ప్రచారాన్ని PIB Fact Check ట్విట్టర్ సాక్షిగా కొట్టిపారేసింది. ఇది ఫేక్ ప్రచారమని, ఇందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఇలా లక్కీ డ్రాను ప్రభుత్వం నిర్వహించలేదని తేలింది. నిరాధార వార్తలను, ఇలాంటి అసత్య ప్రచారాలను గుర్తించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు PIB Fact Check పనిచేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ విభాగం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇంటర్నెట్‌లో సత్య దూరమైన ప్రచారాలను తిప్పి కొడుతూ ప్రజలకు వాస్తవాలను తెలియజేయడమే ఈ విభాగం ప్రధాన ఉద్దేశం. పలు ఫేక్ ప్రచారాలపై ప్రజల్లో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించి సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలను PIB తిప్పికొడుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news