ఫ్యాక్ట్ చెక్ : పాన్ కార్డు అప్డేట్ చెయ్యకపోతే SBI బ్యాంక్ అకౌంట్ ఉండదా..?

-

ఈ మధ్యకాలంలో చాలా నకిలీ వార్తలు మనకి కనపడుతున్నాయి. కొన్ని నకిలీ వార్తలు చూస్తే అది నకిలీ వార్త అని కూడా తెలీదు. నిజం అని అందరూ నమ్ముతూ ఉంటారు. సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకూ అటువంటి వాటికి దూరంగా ఉండాలి. అనుమానస్పద లింక్స్ కనుక వచ్చాయి అంటే జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా వాటి మీద క్లిక్ చేసి మోసపోకండి.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది మరి అది నిజమా కాదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు తో ఈ మెసేజ్ అందరికీ వస్తోంది. పాన్ కార్డు ని అప్డేట్ చేసుకోవాలని.. లేకపోతే అకౌంట్ క్లోజ్ అయిపోతుందని పాన్ కార్డు ని అప్డేట్ చేసుకోవడానికి ఒక లింక్ ని కూడా ఇస్తున్నారు. మరి నిజంగా పాన్ కార్డు ని అప్డేట్ చేసుకోమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోందా.? ఇది ఎంత వరకు నిజం అనేది చూస్తే ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఈ మెయిల్స్ లేదా ఎస్ఎంఎస్ వంటివి పర్సనల్ డీటెయిల్స్ ని బ్యాంకింగ్ డీటెయిల్స్ ని అడిగేందుకు పంపించదు. ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే ఇందులో ఏమాత్రం నిజం లేదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది ఇటువంటి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది కాబట్టి అనవసరంగా ఇటువంటి వార్తలను నమ్మి మోసపోకండి. చాలామంది ఇది నిజం అనుకుని క్లిక్ చేస్తున్నారు. దీంతో నష్టపోవాల్సి వుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి లేకపోతే లేనిపోని ఇబ్బందులు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news