“రామ…రామ”: తృటిలో తప్పిన పెనుప్రమాదం… శ్రీరామనవమిలో అపశ్రుతి !

-

ఈ రోజున దేశవ్యాప్తంగా రాములవారు ప్రసిద్ధి చెందిన అన్ని చోట్ల శ్రీరామనవమిని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా రాముని వేడుకలు జరుగుతున్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామం లో అనుకోకుండా ఒక అపశృతి జరిగింది. దువ్వ లోని వేణుగోపాలస్వామి ఆలయం ప్రాంగణంలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీరామనవమి వేడుకలలో భాగంగా ఆలయం బయట చలువ పందిళ్లను వేసి చక్కగా అలంకరించారు.

భక్తులు అందరూ చలువ పందిళ్ళ కిందనే ఉండగా ఈ ప్రమాదం జరిగింధి. ఒక్కసారిగా మంటలు వ్యాపించగా భక్తులు ఆందోళనకు గురై వెంటనే బయటకు వచ్చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణం గానే ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు గుర్తించారు. ఆ శ్రీరాముని దయ వలన ఇంత ప్రమాదం జరిగినా ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేడనై భక్తులు శ్రీరామనామ జపం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news