ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాన్ని మనం చూసే ఉంటాము..ఇంకా చెప్పాలంటే వడగళ్ళ వానను అందరూ చూసే ఉంటారు.ఇంకా గాలి,దుమ్ము తో కూడిన వర్షం ను కూడా చూసే ఉంటారు.కానీ చేపల వాన కురవడం చాలా తక్కువగా వినే ఉంటాము..రాళ్ల వర్షం కురుస్తుంది. కానీ వింతగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేపల వర్షం కురిసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది..
వివరాల్లోకి వెళ్లితే.. మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం గ్రామం అటవీ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో, పలుగుల వెళ్లే హనుమాన్ నగర్ రోడ్డు పైన చేపలు ప్రత్యక్షమవడంతో కాళేశ్వరం ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. ఆదివారం కురిసిన భారీ వర్షానికి కాళేశ్వరం పరిసర ప్రాంతాల్లో చేపలు ప్రత్యక్షం కావడంతో అటుగా ఉపాధిహామీ పనులకు వెళ్తున్న కూలీలకు చేపలు కనబడటంతో చేపలను పట్టుకున్నారు.
ఈ సందర్బంగా ఉపాధిహామీ కూలీలు మాట్లాడుతూ.. ఇలా ఆకాశాన్నుంచి చేపలు పడటం ఇదే మొదటి సారని, ఇప్పటివరకు ఇలాంటి చేపలను ఎప్పుడూ చూడలేదని ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో అని, అందరికి ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు.పలుచోట్ల కనిపించిన చేపలను చూడడానికి స్థానికులు తరలివెళ్తున్నారు. దీంతో అక్కడ పండగ వాతావరణం కనిపించింది. మృగశిరకార్తెలో చేపలు తినాలని అంటారు. చేపల వాన పడడంతో చేపలు కొనకుండానే ఇంటికి తీసికెళ్ళారు స్థానికులు,ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..