మేము ఏమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు : బాసర విద్యార్థులు

-

బాసర ట్రిపుల్‌ ఐటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత ఏడు రోజులుగా విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తాజాగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మేము ఏమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఆర్జీయూకేటి యాక్ట్ ప్రకారం ఛాన్సలర్, వైస్ చాన్సలర్ పోస్టుల ను భర్తీ ప్రక్రియ చేయాలన్నారు. 311, 312 గ్రాంట్ లు రావడం లేదని విద్యార్థులు వెల్లడించారు. 2018 నుంచి వైస్ ఛాన్సలర్ భర్తీ చేస్తామన్నారు.. ఇప్పటికీ చేయలేదని విద్యార్థులు మండిపడ్డారు.

Basra IIIT gets lower grade from NAAC! | Sakshi Education

ఆర్థిక మంత్రి 312 గ్రాంట్ విడుదల చేయాలనంటూ విద్యార్థులు తమ డిమాండ్ లను చదివి వినిపించారు. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లేదా ప్రెస్ నోట్ సంతకం విడుదల చేస్తే అప్పుడు ఆందోళన విరమిస్తామని వారు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే తెలంగాణ విద్యా శాఖ విద్యార్థులు నిరసనలు విరమించాలని సమస్యలన్నీ పరిష్కరిస్తామని వెల్లడించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా వీసీని నియమిస్తున్నట్లు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news