ఏడుస్తున్న ఏడు వారాల పాపకు మద్యం తాగించిన తల్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

-

తల్లిబిడ్డను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. వాళ్లకు ఇబ్బంది అని తెలిసిన ప్రతిదాన్ని తల్లి దూరంచేసుకుంటుంది. వాళ్లను కంటికిరెప్పలా కాపాడుతుంది. ఆరు నెలల వరకూ చిన్నారికి పాలు తప్ప మరే ఆహారం ఉండదు. కేవలం తల్లిపాలు తాగి మాత్రమే బిడ్డ ఎదుగుతుంది. అలాంటిది.. ఓ తల్లి బిడ్డ ఏడుస్తుందని మద్యం తాగించింది. అది కూడా ఏడువారాల శిశువుకు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయంటే..

ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా(California, USA)లో జరిగింది. హానెస్టీ డి లా టోర్రే అనే 37 ఏళ్ల మహిళ ఏడు వారాల పాపకు పాలకు బదులుగా ఆల్కహాల్ ఇచ్చింది. ఆమె కారు డ్రైవింగ్ చేస్తుండగా.. పాప నిత్యం ఏడుస్తూ ఉండటంతో పసిపాప ఏడుపు ఆపేందుకు ఓ పాల సీసాలో మద్యం నింపింది. ఆ తర్వాత చిన్నారి ఆరోగ్యం క్షీణించింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. చిన్నారి శరీరంలో మద్యం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. డాక్టర్ల కంప్లైంట్ ఆధారంగా బిడ్డకు మద్యం తాగించిన తల్లిని అరెస్ట్ చేశారు.

టోర్రే లాస్ ఏంజిల్స్ నుంచి 55 మైళ్ల దూరంలో ఉన్న రియాల్టోకు డ్రైవింగ్ చేస్తున్నట్లు తెలిపింది ఆ చిన్నారిని చాలా రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించారు. అయితే చిన్నారి పరిస్థితిపై పూర్తి సమాచారం ఇంకా బయటకు రాలేదు. కన్నతల్లి బిడ్డను కాపాడుకోవాల్సింది పోయి ప్రాణాలకు హానికలిగించిందని ఆమెకు $60,000 జరిమానా విధించారు.

బిడ్డకు తల్లి పాలు ఎంత అవసరం..?

ఆరు నెలల పాటు బిడ్డ ఎదుగుదలకు తల్లిపాలు చాలా ముఖ్యమని వైద్యులు చెప్తున్నారు. దీని తరువాత ఆ పసిపాపకు అవసరమైన ద్రవ ఆహారం, మృదువైన ఆహారం ఇస్తారు. చిన్నతనంలో పిల్లల పోషణ సరిగా చూసుకోకపేతే వారు పెద్దయ్యాక అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తల్లిపాల ద్వారానే బిడ్డలకు ఇమ్యునిటీ పవర్‌ అందుతుంది. తల్లి పాలు ఎక్కువగా తీసుకోని శిశువుల కంటే ఆరు నెలల పాటు తల్లి పాలు తాగే శిశువుల మెదడు పదునైనదని ఇటీవలి పరిశోధనలో కూడా తేలింది. కాబట్టి మాతృత్వం అనుభూతిని పొందాలంటే.. తల్లి బిడ్డకు పాలివ్వాల్సిందే. చాలా మంది.. ప్యాకెట్‌ పాలను ఇస్తుంటారు. ఇది శిశువుల ఆరోగ్యానికి ఏం అంత మంచిది కాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version