త‌న‌ను ఆట‌ప‌ట్టించిన వ్య‌క్తికి బుద్ధి చెప్పిన పాము.. ఏం జ‌రిగిందంటే..(వీడియో)

సాధార‌నంగా ఎవ‌రైనా ఖాళీగా ఉంటే ఫోన్‌తోనూ లేదా తాము ఇష్ట‌ప‌డే పెట్స్‌తోనూ ఆడుతుంటారు. అయితే  ఓ వ్యక్తి సరదా కోసం ఏకంగా పాముతోనే ఆటలు ఆడాడు. చివ‌ర‌కు ఆ పాము అత‌డికి బాగా బుద్ధి చెప్పింది. మ‌రి వివ‌రాల్లోకి వెళ్తే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భయపెట్టే ఈ వీడియోలో.. పాములను పట్టే ఈ వ్యక్తి తన దగ్గర ఉన్న కొండ చిలువను చేతితో గాలిలో పట్టుకుని దాని మొహంపై ఊదుతూ దానితో ఆడుకుంటు రెచ్చగొట్టెలా ప్రవర్తిస్తున్నాడు.

ఆవేదన చెందుతున్న పాము అతను చేసే వెద‌వ చేష్టలకు అది కూడా నోరు తెరిచి కోపంగా అతని మీదకు లేస్తూ చివరకు సైలెంట్ అయింది. పాము సైలెంట్‌ కావడంతో అతను దానిని ముద్దు చేస్తూ నుదిటిపై పెట్టుకున్నాడు. దీంతో ఛాన్స్ కోసం ఎదురు చూసిన ఆ కొండ‌చిలువ‌ అత‌ని త‌ల‌ను గ‌ట్టిగా ప‌ట్టుకుంది. ఇక ఆ త‌ర్వాత దాన్ని వ‌దిలించుకోవ‌డానికి నానా తిప్ప‌లు ప‌డ్డాడు. ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతుంది.

సెప్టెంబర్ 19 న ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన తర్వాత, ఈ వీడియో 2 లక్షల వ్యూలు సంపాధించింది. ఎన్నో కామెంట్లు కూడా చేశారు. నీకు ఇలా జరగడమే కరెక్ట్` అని.. బాగైంది.. ఇలా ర‌క‌ర‌కాల కామెంట్లు పెట్టి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు నెటిజ‌న్లు. జంతువుల‌కు ర‌క్ష‌ణ‌తో పాటు గౌర‌వం కూడా ఇవ్వాల‌ని అంటున్నారు మ‌రి కొంద‌రు.