ఐష్ పై వివేక్ వివాదాస్పద ట్వీట్.. దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. ట్వీట్ డిలీట్

అందులో తప్పేముంది అసలు.. అందులో ఉన్నవాళ్లు ఎవ్వరూ ఫీల్ అవకున్నా.. మీరెందుకు అంతలా ఫీల్ అవుతున్నారు. నేను తప్పు చేస్తే క్షమాపణలు చెబుతా. కానీ.. నేను చేసిన తప్పేంటి చెప్పండి.. అంటూ వివేక్ గట్టిగానే నెటిజన్లకు బదులిచ్చారు.

వివేక్ ఒబెరాయ్… బాలీవుడ్ నటుడు. అంత వివాదాస్పద నటుడు అయితే కాదు. కానీ.. రీసెంట్ గా సోషల్ మీడియాలో వివేక్ పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మండిపడుతున్నారు. కారణం.. ఆయన చేసిన ఒకే ఒక ట్వీట్. ఆయన ఎవ్వరినీ పల్లెత్తు మాట అన్నది లేదు.. కానీ.. ఒక ట్వీట్ చేశారు.. అంతే.. అది అడ్డంగా బెడిసి కొట్టింది.

Vivek Oberoi tweet on Aishwarya Rai, later tweet deleted

ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే.. ఐశ్వర్యారాయ్ గురించి. మీమ్ రూపంలో ఉన్న ఓ ఫోటోను ఆయనకు ఎవరో పంపిస్తే.. ఈయన కాసేపు ఆ ఫోటోను చూసి నవ్వుకొని.. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. నో పాలిటిక్స్ అంటూ ఆ ఫోటోను షేర్ చేసినప్పటికీ.. నెటిజన్లు ఊరుకోలేదు. ఐశ్వర్యారాయ్ పై ఇటువంటి ట్వీట్ చేస్తావా? చివరకు మహిళా సంఘాలు కూడా దిగాయి. బేషరతుగా వివేక్ ఒబేరాయ్ క్షమాపణలు చెప్పాల్సిందే. మహిళలను కించపరిచే విధంగా ట్వీట్ చేశారు అంటూ ఆయనపై మహారాష్ట్రకు చెందిన మహిళా కమిషన్ కేసు కూడా నమోదు చేసింది. ఇంతకీ.. అంతలా ఐశ్వర్యను కించపరిచే విధంగా ఏముంది ఆ ఫోటోలో అంటారా? అయితే ముందు ఆయన ట్వీట్ చేసిన ఫోటోను చూడండి. అప్పుడు మీకు ఓ క్లారిటీ వస్తుంది.

Vivek Oberoi tweet on Aishwarya Rai, later tweet deleted

చూశారా? అది సంగతి. ఇటీవల ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి కదా.. ఆ ఉద్దేశంతో ఎవరో తయారు చేసిన ట్వీట్ ను ఆయన తను ట్వీట్ చేశారు. అందులో తప్పేముంది అసలు.. అందులో ఉన్నవాళ్లు ఎవ్వరూ ఫీల్ అవకున్నా.. మీరెందుకు అంతలా ఫీల్ అవుతున్నారు. నేను తప్పు చేస్తే క్షమాపణలు చెబుతా. కానీ.. నేను చేసిన తప్పేంటి చెప్పండి.. అంటూ వివేక్ గట్టిగానే నెటిజన్లకు బదులిచ్చారు.

కానీ.. నెటిజన్లు ఊరుకుంటే కదా.. వివేక్ ఒబెరాయ్ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ పలువురు సినీ ప్రముఖులు కూడా రంగంలోకి దిగారు. సోనమ్ కపూర్ కూడా వివేక్ పై మండిపడింది. సోషల్ మీడియా అంతా వివేక్ పై గుర్రుగా ఉండటంతో ఇక చేసేది లేక వివేక్ ఆ ట్వీట్ ను తన ట్విట్టర్ ఖాతా నుంచి తీసేసి.. క్షమాపణలు కోరారు వివేక్.

ఒక్కోసారి మనకు ఫన్నీగా, ఎటువంటి హానీ జరగని విధంగా కొన్ని కనిపిస్తాయి.. అందరికీ కాదు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కనిపిస్తుంది ఈ ప్రపంచం. నేను గత 10 సంవత్సరాల నుంచి 2000 కు పైగా పేద అమ్మాయిల సాధికారత కోసం పనిచేస్తున్నా. ఏ మహిళలను అయినా కించపరచాలి అని కూడా నేను ఆలోచించను.. అంటూ కొంచెం భావోద్వేగంతో వివేక్ ట్వీట్ చేశారు.

నేను చేసిన పనికి ఒక్క మహిళ బాధపడినా దానికి నివారణ చర్యలు తీసుకోవాలి. అందుకే… నా ట్వీట్ వల్ల బాధపడిన ప్రతి ఒక్కరిని క్షమించమని వేడుకుంటున్నా. ట్వీట్ డిలీట్ చేశా.. అంటూ మరో ట్వీట్ చేశారు వివేక్. దీంతో ఈ గొడవ కాస్త సద్దుమణిగింది.