‘నాటు నాటు’ను మించిన జవోలి డ్యాన్స్..! తేడాలొస్తే కాళ్లు ఉండవు..!

-

నాటు నాటు డ్యాన్స్‌ స్టెప్స్‌ ఇప్పటికే చాలామంది ప్రాక్టీస్‌ చేసి రీల్స్‌ చేసి ఉంటారు.. సోషల్‌ మీడియా ప్రభంజనం అయిపోయింది.. ఆ పాటలో స్టెప్స్‌ కంటే కష్టమైన డ్యాన్స్‌ ఒకటి ఉంది.. ఈ డ్యాన్స్‌ వేసేప్పుడు అటు ఇటు అయితే కాళ్లు విరిగిపోతాయట. దాని పేరే జవోలి (Zaouli). పశ్చిమాఫ్రికాలోని సెంట్రల్ ఐవరీ కోస్ట్‌లో నివసించే గురో (Guro) తెగ ప్రజలకు చెందిందే ఈ సంప్రదాయ నృత్యం. వాళ్లు డ్యాన్స్ చేస్తుంటే మీ కళ్లను మీరే నమ్మలేరు. కేవలం రెండు కాళ్లను కదుపుతూ ఎక్కడా ఆగకుండా, కో ఆర్డినేషన్ తప్పకుండా డ్యాన్స్ చేస్తారు.. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది..

వైరల్‌ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి జవోలి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. అది చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రపంచంలోనే అతి కష్టమైన డ్యాన్స్ ఇదేనంటూ తేల్చి చెప్పేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోని 20 లక్షల మంది చూశారు. 45 వేల మంది లైక్ చేశారు. ఇక షేర్‌లు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.

ఏంటీ డ్యాన్స్..

ఈ డ్యాన్స్‌లో స్పెషల్ ఏంటో తెలుసా..? జస్ట్ కాళ్లు మాత్రం కదపాలి. అది కూడా చాలా వేగంగా. కాస్త తేడా వచ్చినా కింద పడిపోవడమే. ప్రత్యేకంగా డిజైన్ చేసిన మాస్క్ తప్పకుండా ధరిస్తారు.. ఈ డ్యాన్స్‌లో ఆరితేరడం అంత సులభం కాదు.. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. పాప్ రారాజు మైకేల్ జాక్సన్ కొన్ని స్టెప్స్‌కి ఈ డ్యాన్సే ఇన్‌స్పిరేషన్ అంటారు. జవోలి నృత్యం చూసి ఆయన కొన్ని చోట్ల ఆ డ్యాన్స్‌ను అనుకరించే ప్రయత్నం చేశారట. డ్యాన్సర్‌ వెనకాలే ఓ డ్రమ్మర్ ఫాలో అవుతుంటాడు. ఆ బీట్‌కి తగ్గట్టుగా…చాలా స్పీడ్‌గా కదులుతుంటాడు డ్యాన్సర్.

ఈ నృత్యంలో కేవలం కాళ్లు మాత్రమే కదుల్తాయి. పైభాగం అంతా స్టెడీగానే ఉంటుంది. అంతే కాదు. ఓసారి వేసిన స్టెప్ మరోసారి వేయకూడదు. అంటే రిపీట్ అవదనమాట.. వీళ్లు పెట్టకునే మాస్క్‌కి కూడా ఓ స్పెషాల్టీ ఉంది. మహిళల గొప్పతనానికే కాకుండా వారి అందానికీ ఇది ప్రతీక అని ఆ తెగ ప్రజలు నమ్ముతారు. దాదాపు 6 రోజుల పాటు కష్టపడి ఈ మాస్క్ తయారు చేసుకుంటారు. అయితే…ఇది ఎలా తయారు చేస్తారన్నది మాత్రం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. ఓ సారి ఈ మాస్క్ పెట్టుకుంటే ఆ వ్యక్తి కేవలం “మనిషి” మాత్రమే కాదని, ఓ మానవాతీత శక్తిగా మారి వేగంగా కదులుతారని
వాళ్లు బలంగా నమ్ముతారు..

ఈ ప్రపంచంలో ఎన్నో తెగల్లో మంచి మంచి టాలెంట్‌ ఉన్న వాళ్లు ఉన్నారు. వారి టాలెంట్‌ను బయటకు తీస్తే రికార్డులు క్యూ కడతాయి.. మనం ఇక్కడ ఆర్చరీ కోర్సు తీసుకుని నేర్చుకుంటాం.. కానీ అడవుల్లో ఉండేవారికి వెన్నతో పెట్టిన విద్య.. చిన్న పిల్లలు కూడా అవలీలగా గురితప్పకుండా వేస్తారు..

Read more RELATED
Recommended to you

Latest news