మనుషుల్లో శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరూ అనేది మనకు తెలుసుకోవడం తేలికే. కొన్నాళ్లు స్నేహం చేస్తే అదే అర్థమవుతుంది కానీ మనం తినే వాటిలో మనం రోజూ ఉపయోగించే వాటిలో ఏది మంచిది, ఏది చెడ్డది అని తెలుసుకోవడం చాలా కష్టం. విచిత్రం ఏంటంటే ఉప్పు లేకుండా కూర వండలేం, పంచాదార లేకుండా ఛాయ్,కాఫీలు, స్వీట్స్ చేసుకోలేం. ఇవి మనకు డైలీ కావాలి. అలా మనం తెలియకుండానే అత్యంత ప్రమాదకరమైన వాటిని రోజూ వాడేస్తున్నాం. ఉప్పు, పంచదార మీ ఆరోగ్యానికి ఎంత డేంజరే మీరెప్పుడైనా ఆలోచించారా..? ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. ఇదీ అంతే ఈ శత్రువులను మీరు తెలిసి తెలిసి కేజీలకు కేజీలు వాడేస్తున్నారు.
ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతున్నారు. గుండె జబ్బుల బారిన పడడానికి ప్రధాన కారణం అధిక రక్తపోటు అని మనందరికి తెలిసిందే. అధిక రక్తపోటుతో బాధపడే వారిలో గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే నిపుణులు జరిపిన తాజా అధ్యయనాల ప్రకారం.. గుండె జబ్బులు, అధిక రక్తపోటుతో పాటు శరీరంలో ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడానికి కారణం పంచదార అని తేలింది.
ఉప్పును తక్కువగా తీసుకోవడం వల్ల కొందరిలో రక్తపోటు తగ్గినప్పటికి అది తక్కువ మోతాదులో మాత్రమే తగ్గుతుంది. అలాగే ఉప్పును తక్కువగా తీసుకోవడం వల్ల కొందరిలో రక్తపోటు పెరుగుతుంది. కేవలం రక్తపోటు సమస్యే కాకుండా ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయట.
అదే విధంగా పంచదారను ఎక్కువగా తీసుకోవడం వల్ల స్థూలకాయం, మధుమేహంతో పాటు అథెరోస్ల్కెరోసిస్‌కు కారణమవుతుంది. అలాగే పంచదారను ఎక్కువగా తీసుకోవడం వల్ల అది క్రమంగా గుండె జబ్బులకు దారి తీస్తుంది. మన గుండె ఆరోగ్యంతో పాటు మన శరీర ఆరోగ్యం మెరుగుపడాలన్నా మనం ఉప్పును, పంచదారను తక్కువగా తీసుకోవాలి.
వంటల్లో ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. అలాగే ఫ్రూట్ జ్యూస్‌లో పంచదార వాడకాన్ని తగ్గించాలి. పంచదారకు బదులుగా తేనె, ఖర్జూర పండ్లను ఉపయోగించుకోవచ్చు. టీ, కాఫీలల్లో పంచదారను ఎక్కువగా వేసుకోకూడదు. చాక్లెట్స్, కేక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటికి బదులుగా తాజా పండ్లను ఆహారంగా తీసుకోవాలి. ఇలా పంచదారను, ఉప్పును తక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు