పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయితే చాలు..వెంటనే..వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టడం..పవన్ పై విరుచుకుపడటం చేస్తారు. ఇక పవన్ వారాహి యాత్ర షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి వైసీపీ నేతలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇక తాజాగా పవన్ యాత్ర మొదలైంది..వైసీపీపై విరుచుకుపడ్డారు. క్లాస్ వార్ అంటూ జగన్ జనం దగ్గర అమాయకంగా నవ్వుతూ మోసం చేస్తున్నారని, వేల కోట్లు దోచేసిన వ్యక్తి క్లాస్ వార్ అనడం విడ్డూరంగా ఉందని విరుచుకుపడ్డారు.
ఖచ్చితంగా నెక్స్ట్ ఎన్నికల్లో జగన్‌ని గద్దె దించుతామని, తనని అసెంబ్లీకి వెళ్లకుండా ఈ సారి ఎవరు ఆపలేరని చెప్పి పవన్ అన్నారు. ఇక పవన్ వెనుకే వైసీపీ కాపు నేతలు ప్రెస్ మీట్లతో రెడీ అయిపోయారు. పవన్ టార్గెట్ గా పేర్ని నాని విరుచుకుపడ్డారు. పవన్ ఒక చెప్పు చూపిస్తే..తమ దగ్గర రెండు చెప్పులు ఉన్నాయని, రెండు చెప్పులు చూపించారు. . పవన్ చేస్తున్నది వారాహి యాత్ర కాదని.. నారాహి యాత్రని విమర్శించారు. పదేళ్లుగా పవన్ పార్టీని నడుపుతున్నది చంద్రబాబేనని, ప్రజలను నమ్ముకుంటే అసెంబ్లీలో సీట్లు వస్తాయని, వ్యూహాలను నమ్ముకుంటే శాసనసభకు కూడా రాలేరని, సీఎం పదవి ఏమైనా దానమా?.. ఎవరైనా ఇస్తే తీసుకోడానికి అంటూ ఫైర్ అయ్యారు.
అయితే ఇలా పవన్ మాట్లాడిన వెంటనే వైసీపీ కాపు నేతలు విరుచుకుపడుతున్నారు. దీని వెనుక పెద్ద కారణమే ఉంది. గత ఎన్నికల్లు మెజారిటీ కాపు ఓటర్లు వైసీపీకే ఓటు వేశారు. కానీ ఇప్పుడు వారి మైండ్‌సెట్ మారుతుంది. వారు పవన్ వెనుక నడిచేందుకు రెడీ అవుతున్నారు. దీంతో పవన్ వెనుక కాపులు వెళ్లకుండా..అదే కాపు నేతలతో పవన్‌ని తిట్టించి, ఆయన్ని నెగిటివ్ చేసి మళ్ళీ కాపు ఓటర్లని తమవైపుకు తిప్పుకోవాలని వైసీపీ ప్లాన్ చేస్తుందని, అందుకే ఇలా పవన్‌ని టార్గెట్ చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.